న్యూఢిల్లీ: ఢిల్లీతో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 14 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో ఓ సంఘటన చోటుచేసుకున్నది. ఢిల్లీ బౌలర్ కుల్దీప్ యాదవ్.. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్(Rinku Singh) చెంపపై కొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. మ్యాచ్ ముగిసిన తర్వాత కుల్దీప్, రింకూలతో పాటు ఇతరు ప్లేయర్లు సరదాగా ముచ్చట్లాడుతున్నట్లు కనిపించారు. అయితే అకస్మాత్తుగా రింకూ చెంపై కుల్దీప్ కొట్టాడు. నవ్వుతూ మాట్లాడుకుంటున్న దశలో ఏం జరిగిందో రింకూకు అర్థం కాలేదు. మరోసారి కూడా కుల్దీప్ చేయి వెత్తడంతో.. రింకూ ఆ దశలో తన ఫేస్ రూపాన్ని మార్చేశాడు. నిజానికి అక్కడ ప్లేయర్లు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కానీ వీడియో ద్వారా మాత్రం కుల్దీప్ ఏదో ఆవేశంలో రింకూపై చేయి చేసుకున్నట్లు తెలిసింది. కుల్దీప్ వ్యవహారశైలిని కొందరు ఖండిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు బీసీసీఐని కోరారు.
Yo kuldeep watch it pic.twitter.com/z2gp4PK3OY
— irate lobster🦞 (@rajadityax) April 29, 2025
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతాకు బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. అంగ్క్రిష్ రఘువంశీ (32 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్ (25 బంతుల్లో 36, 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 190/9 పరిమితమైంది. డుప్లెసిస్(62), అక్షర్‌పటేల్(43)రాణించారు. నరైన్(3/29), వరుణ్ చక్రవర్తి(2/39)..ఢిల్లీ పతనాన్ని శాసించారు.