IND vs Oman : చివరి లీగ్ మ్యాచ్లో ఒమన్ (Oman) బ్యాటర్లు అసమాన పోరాటం కనబరుస్తున్నారు. దాంతో, భారీ స్కోర్ చేసిన భారత జట్టు అలవోకగా గెలుస్తుందనుకుంటే చెమటోడ్చక తప్పడం లేదు. టీమిండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ఉరికిస్తున్నారు. ఓపెనర్ అమీర్ కలీం(23 నాటౌట్), కెప్టెన్ సిమర్జిత్ సింగ్(32)లు పవర్ ప్లేలో దూకుడుగా ఆడారు. దాంతో.. వికెట్ కోల్పోకుండా 44 రన్స్ చేసింది ఒమన్.
జిడ్డులా క్రీజునంటుకొని విసిగిస్తున్న ఈ ద్వయాన్ని ఎట్టకేలకు కుల్దీప్ యాదవ్ విడదీశాడు. 9వ ఓవర్లో సిమర్జిత్ను బౌల్డ్ చేసిన తొలి వికెట్ అందించాడు. అయినా సరే అమిర్, హమ్మద్ మిర్జా(5 నాటౌట్)లు గట్టిగా పోరాడుతున్నారు. 11 ఓవర్లకు ఒమన్ స్కోర్.. 71/1. ఇంకా ఆ జట్టు విజయానికి 119 రన్స్ కావాలి.
Kuldeep Yadav breaks the deadlock and Oman have lost their first wicket in the 9th over for 56 runs.https://t.co/f821Q2KeZt #INDvOMA #AsiaCup2025 pic.twitter.com/uYDJJ8bfi0
— BCCI (@BCCI) September 19, 2025
ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. ఒమన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓపెనర్ అభిషేక్ శర్మ(38) విధ్వంసం కొనసాగించగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు. దాంతో.. టీమిండియా అలవకోగా రెండొందలు కొడుతుందని అనుకున్నారంతా. కానీ, మిడిల్ ఓవర్లలో ఒమన్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే.. తిలక్ వర్మ(29), అక్షర్ పటేల్ (26) లు బౌండరీలతో హోరెత్తించి జట్టుకు భారీ స్కోర్ అందించారు. దాంతో, సూర్యకుమార్ యాదవ్ సేన నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి188 పరుగులు చేసింది.