Krunal Pandya : సీజన్ సీజన్‌కు ఐపీఎల్ సరికొత్తగా అభిమానులను అలరిస్తూనే ఉంది. పద్దెనిమిది సీజన్లలో ఐపీఎల్ రికార్డు బ్రేకర్స్ చాలామందే. ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గెలుచుకున్న వాళ్లు కొందరైతే.. టోర్నీ ఆసాంతం అదరగొట్టి ‘మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్’ అవార్డు తన్నుకుపోయిన ఆటగాళ్లు మరికొందరు. అయితే.. రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నది మాత్రం ఒకేఒక్కడు.
ఐపీఎల్లో రికార్డు బ్రేకర్స్ ఎందరున్నా కృనాల్ పాండ్యా (Krunal Pandya) చెక్కుచెదరని రికార్డు నెలకొల్పాడు. రెండుసార్లు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడీ ఆల్‌రౌండర్. 2017లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన కృనాల్ ఫైనల్లో 38 బంతుల్లో 47 పరుగులతో రాణించాడు. పద్దెనిమిదో సీజన్లో (2025లో) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ వేసుకున్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఫైనల్లో రెచ్చిపోయాడు.
Krunal Pandya is the only player to win the Player of the Match in two IPL finals 🙌 pic.twitter.com/Df4H78Pde9
— ESPNcricinfo (@ESPNcricinfo) March 23, 2026
నిరుడు జూన్ 3 వ తేదీన జరిగిన టైటిల్ పోరులో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లను దెబ్బతీసి మ్యాచ్‌ను ఆర్సీబీవైపు తిప్పాడు. 17 పరుగులే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన కృనాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు. తద్వారా రెండుసార్లు ఐపీఎల్ ఫైనల్లో ఈ అవార్డు అందుకున్న తొలి ఆటగాడిగా ఈ బరోడా క్రికెటర్ రికార్డు నెలకొల్పాడు.
Spinner, seamer, batter, winner: Krunal Pandya is RCB’s man for all seasons
An interview:
https://t.co/0rtCS0KIrm— ESPNcricinfo (@ESPNcricinfo) March 23, 2026