INDW vs SLW : వన్డే వరల్డ్ కప్ తొలి పోరులో భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో శ్రీలంక తొలి వికెట్ పడింది. ఓపెనర్ హాసినీ పెరీరా(14) ఔటయ్యింది. క్రాంతి గౌడ్ బౌలింగ్‌లో షాట్ ఆడబోయిన ఆమె క్లీన్‌బౌల్డ్ అయింది. దాంతో.. 30 పరుగుల వద్ద లంక మొదటి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ చమరి ఆటపట్టు(13 నాటౌట్), హర్షిత సమరవిక్రమ (13 నాటౌట్) ఆడుతున్నారు. 8 ఓవర్లకు లంక స్కోర్.. ఇంకా జట్టు విజయానికి 227 పరుగులు కావాలి.
భారత మిడిలార్డర్ తడబడినా ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాపార్డర్ విఫలమైనా అమన్‌జోత్ కౌర్ (57), దీప్తి శర్మ(53)లు అర్ధ శతకాలతో చెలరేగి జట్టుకు స్కోరందించారు. శ్రీలంక స్పిన్నర్ ఇనొకా రణవీర (4-46) విజృంభణతో ఒక దశలో124కే ఆరు వికెట్లు పడి ఆలౌట్ అంచున నిలిచిన టీమిండియా ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచారిద్దరూ. ఏడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. ఆఖరి బంతికి దీప్తి ఔట్ కాగా భారత్ 47 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.
𝙄𝙣𝙣𝙞𝙣𝙜𝙨 𝘽𝙧𝙚𝙖𝙠!#TeamIndia posted 269/8 on the board! 💪
5⃣7⃣ for Amanjot Kaur
5⃣3⃣ for Deepti Sharma
4⃣8⃣ for Harleen Deol
3⃣7⃣ for Pratika Rawal
2⃣8⃣* for Sneh RanaOver to our bowlers now! 👍
Scorecard ▶️ https://t.co/lcSNn7a0WF#WomenInBlue | #CWC25 | #INDvSL pic.twitter.com/ZALLWzMzVo
— BCCI Women (@BCCIWomen) September 30, 2025