China Masters : భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు వరుసగా రెండో ఫైనల్లోనూ చుక్కెదురైంది. ఇటీవలే హాంకాంగ్ ఓపెన్ (HongKong Open) టైటిల్ వేటలో తడబడిన ఈ ద్వయం చైనా మాస్టర్స్ (China Masters)లోనూ కంగుతిన్నది. దక్షిణకొరియాకు చెందిన టాప్ సీడ్ సియో సూయెంగ్ జే – కిమ్ వొన్ హో జోడీకి బదులివ్వలేక వెండి పతకంతోనే సరిపెట్టుకుంది. ఆదివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సాత్విక్ – చిరాగ్ జంట 19-21, 15-21తో ఓటమి పాలైంది.
చైనా మాస్టర్స్‌లో 32వ రౌండ్ నుంచి సాత్విక్ – చిరాగ్ ద్వయం చెలరేగి ఆడింది. వరుస విజయాలతో సెమీస్ చేరిన భారత జంట అరోన్ చియా, సోహ్ వూయీ యిక్ (మలేషియా)లను ఓడించి టైటిల్ వేటకు దూసుకెళ్లింది. ఆద్యంతం దూకడుగా ఆడి 41 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించి దక్షిణ కొరియా షట్లర్లను నిలువరించేందుకు సిద్ధమైంది.
Back-to-back silvers for Satwik–Chirag🥈
A tough battle, a wholehearted fight. The pair left it all on court 💪🏸
A quick turnaround and full focus ahead for the #SmashBros ! pic.twitter.com/ZfhIRzqFjB
— BAI Media (@BAI_Media) September 21, 2025
ఆదివారం జరిగిన ఫైనల్లోనూ దూకుడే మంత్రంగా ఆడారు సాత్విక్ – చిరాగ్. కానీ, వరల్డ్ నంబర్ 1 కొరియా షట్లర్లు మాత్రం పట్టు సడలించలేదు. తొలి సెట్‌ను రెండు పాయింట్ల తేడాతో కోల్పోయిన భారత జంట.. రెండో సెట్లో మరీ దారుణంగా ఆరు పాయింట్లు వెనకబడింది. దాంతో.. వరుసగా రెండో ఫైనల్లోనూ ఓటమితో సిల్వర్ మెడల్‌తోనే సరిపెట్టుకుంది భారత జోడీ.