IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో ఎంఎస్ ధోనీ(MS Dhoni) కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. గాయం కారణంగా సారథి రుతురాజ్ గైక్వాడ్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు తాలా మళ్లీ నాయకత్వం వహించనున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)తో చెపాక్ మైదానంలో మహీ భాయ్‌కు తొలి సవాల్‌కు సిద్ధమయ్యాడు. టాస్ గెలిచినఅజింక్యా రహానే(Ajinkya Rahane) బౌలింగ్ తీసుకున్నాడు.
కోల్‌కతా తుది జట్టు : క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, మోయిన్ అలీ, ఆండ్రూ రస్సెల్, రమన్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
ఇంప్యాక్ట్ సబ్ : అంగ్క్రిష్ రఘువంశీ, మనీశ్ పాండే, రొవ్మన్ పావెల్, లవ్‌నీత్ సిసోడియా, అనుకుల్ రాయ్.
🚨 Toss 🚨@KKRiders won the toss and elected to bowl against @ChennaiIPL in Chennai.
Updates ▶ https://t.co/gPLIYGimQn#TATAIPL | #CSKvKKR pic.twitter.com/r2GTOQ6cvc
— IndianPremierLeague (@IPL) April 11, 2025
చెన్నై తుది జట్టు : రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్, శివం దూబే, ధోనీ(కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్.
ఇంప్యాక్ట్ సబ్ : మథీశ పథిరన, జేమీ ఓవర్టన్, దీపక్ హుడా, షేక్ రషీద్, కమలేశ్ నగర్కోటి.
పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియిన్ ముందంజ వేయాలనే కసితో ఉంది. వరుసగా 4 పరాజయాలతో 9వ స్థానంలో కొనసాగుతున్న చెన్నై విజయంతో ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. దాంతో, అచ్చొచ్చిన చెపాక్‌లో ధోనీ సీఎస్కేను గెలిపిస్తాడా? అనేది ఆసక్తికరం. గత రికార్డులు పరిశీలిస్తే కేకేఆర్‌పై చెన్నై ఆధిపత్యం చెలాయిస్తూ వస్తోంది. ఇరుజట్లు 29 సార్లు ఎదురుపడగా.. సీఎస్కే 19 విజయాలు సాధించగా.. కోల్‌కతా 10 పర్యాయాలు మాత్రమే గెలిచింది.