KKR vs LSG : ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ రెండు వికెట్లు కోల్పోయింది. సునీల్ నరైన్(6), అంగ్క్రిష్ రఘువంశీ(7)లను మోహ్సిన్ ఖాన్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(5) జతగా ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(30) బౌండరీల మోత మోగిస్తున్నాడు. యశ్ ఠాకూర్ వేసిన 6వ ఓవర్లో సాల్ట్ ఏకంగా రెండు ఫోర్లతో చెలరేగుతున్నాడు. దాంతో, కోల్‌కతా పవర్ ప్లేలో 2 వికెట్ల నష్టానికి 58 రన్స్ కొట్టింది. ఆ జట్టు విజయానికి ఇంకా 85 బంతుల్లో 104 రన్స్ కావాలి.
తొలుత ఆడిన లక్నో సూపర్ జెయింట్స్ మోస్తరు స్కోర్ చేసింది. కోల్‌కతా బౌలర్ల విజృంభణతో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేయగలిగింది. స్టార్క్(283) నిప్పులు చెలరేగడంతో రాహుల్ సేన 95 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో విధ్వసంక ఆటగాడు నికోలస్ పూరన్(45) సిక్సర్ల మోత మోగించగా.. యువకెరటం ఆయుష్ బదొని(29)లు ఆదుకున్నారు. వీళ్లిద్దరూ ధనాధన్ ఆడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా బౌలర్లలో స్టార్క్ మూడు, వైభవ్ ఆరోరా ఒక వికెట్ పడగొట్టారు.