ఐపీఎల్ 16వ సీజన్‌ను పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయంతో ఆరంభించింది. ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్(DLS) ప్రకారం పంజాబ్ విజయం సాధించింది. వర్షం పడే సమయానికి కేకేఆర్ 7 వికెట్ల నష్టానికి 146 రన్స్ చేసింది. డీఎల్ఎస్ ప్రకారం ఆజట్టు 16 ఓవర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, 7 పరుగులు వెనకబడి ఉంది. వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు.
ఐపీఎల్ 16వ సీజన్‌ను పంజాబ్ కింగ్స్ విజయంతో ఆరంభించింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 7 పరుగుల తేడాతో గెలుపొందింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పంజాబ్‌ను విజేతగా ప్రకటించారు. వర్షం పడే సమయానికి కేకేఆర్ 16 ఓవర్లకు 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జట్టు 7 పరుగులు వెనకబడి ఉంది.
రసవత్తరంగా జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం పడుతుండడంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ 153 స్కోర్ చేయాలి. కానీ, ఆ జట్టు 7 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం కేకేఆర్ స్కోర్..146/7. శార్దూల్ ఠాకూర్(8), సునీల్ నరైన్(7)తో ఆడుతున్నారు. ఒకవేళ వర్షం తగ్గకుంటే డీఎల్ఎస్ ప్రకారం పంజాబ్ కింగ్స్ విజేతగా నిలుస్తుంది.
కేకేఆర్ మరింత కష్టాల్లో పడింది. అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు ఏడో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ వెంకటేశ్ అయ్యార్ (32) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి అయ్యర్ కవర్స్‌లో రాహుల్ చాహర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్.. 140/7. శార్దూల్ ఠాకూర్(8), సునీల్ నరైన్(1) క్రీజులో ఉన్నారు. కేకేఆర్ జట్టు విజయానికి 24 బంతుల్లో 46 రన్స్ కావాలి.
కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. విధ్వంసక ప్లేయర్ అండ్రూ రస్సెల్ (35) ఔటయ్యాడు. సామ్ కరన్ ఓవర్లో భారీ షాట్ ఆడాడు. రజా బౌండరీ వద్ద క్యాచ్ పట్టడంతో రస్సెల్ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చి శార్దూల్ ఎదుర్కొన్న తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపాడు.
కోల్‌కతా స్కోర్ 100 పరుగులకు చేరింది. వెంకటేశ్ అయ్యార్ (32), అండ్రూ రస్సెల్ (24 ధాటిగా ఆడుతున్నారు. ఎల్లిస్ వేసిన 14వ ఓవర్లో అయ్యర్ చెలరేగాడు. ఫ్రీ హిట్‌ను సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతికి రస్సెల్ బౌండరీ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను ప్రభుసిమ్రాన్ షార్ట్ లెగ్‌లో జారవిడిచాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్.. 118/5. ఆ జట్టు విజయానికి 36 బంతుల్లో74 రన్స్ కావాలి.
కోల్కతాఐదో వికెట్ పడింది. రింకూ సింగ్(4)ను రాహుల్ చాహర్ ఔట్ చేశాడు. రింకూ గాల్లోకి లేపిన బంతిని సికిందర్ రజా అందుకున్నాడు. దాంతో, 80 వద్ద కేకేఆర్ ఐదు వికెట్లు కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. వెంకటేశ్ అయ్యార్ (21), అండ్రూ రస్సెల్ క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్లో కెప్టెన్ నితీశ్ రానా(24)ను ఔట్ చేశాడు.
సికిందర్ రజా ఐపీఎల్లో తొలి వికెట్ తీశాడు.. కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రానా(24)ను ఔట్ చేశాడు. కవర్స్‌లో రాహుల్ చాహర్ క్యాచ్ పట్టడంతో రానా వెనుదిరిగాడు. దాంతో, 76 వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ పడింది. వెంకటేశ్ అయ్యార్ (20), రింకూ సింగ్ క్రీజులో ఉన్నారు. అయ్యర్, నితీశ్ నాలుగో వికెట్‌కు 46 రన్స్ జోడించారు. 10 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 60 బంతుల్లో 112 రన్స్ కావాలి.
కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రానా(24) జోరు పెంచాడు. రిషి ధావన్ వేసిన 9వ ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టాడు. నాలుగో బంతికి వెంకటేశ్ అయ్యార్ (20) బౌండరీ బాదాడు. 9 ఓవర్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ 3వికెట్ల నష్టానికి 80 రన్స్ చేసింది. ఆ జట్టు విజయానికి 66 బంతుల్లో 117 రన్స్ కావాలి.
పవర్ ప్లేలో కోల్‌కతా నైట్ రైడర్స్ 3వికెట్ల నష్టానికి 42 రన్స్ చేసింది. సికిందర్ రజా వేసిన ఆరో ఓవర్లో వెంకటేశ్ అయ్యార్ (10) వరుసగా రెండు బౌండరీలు బాదాడు. దాంతో, 11 పరుగులు వచ్చాయి. కెప్టెన్ నితీశ్ రానా(7) క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(22)ను నాథన్ ఎల్లిస్ బౌల్డ్ చేశాడు. తన మొదటి ఓవర్లోనే అతను వికెట్ సాధించాడు. దాంతో, 29 రన్స్ వద్ద ఆ జట్టు మూడో వికెట్ పడింది. వెంకటేశ్ అయ్యార్ (1) క్రీజులో ఉన్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ బౌన్సర్లు, షార్ట్ పిచ్ బంతులతో కేకేఆర్ బ్యాటర్లను హడలెత్తిస్తున్నాడు. అతను వేసిన నాలుగో ఓవర్లో రహమనుల్లా గుర్బాజ్(22) బౌండరీ కొట్టాడు. వెంకటేశ్ అయ్యార్ (1) క్రీజులో ఉన్నాడు. నాలుగు ఓవర్లకు కేకేఆర్ రెండు వికెట్ల నష్టానికి 29 రన్స్ చేసింది.
రెండో వికెట్ పడ్డాక కోల్‌కతా ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను తీసుకుంది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో వెంకటేశ్ అయ్యార్‌ను రంగంలోకి దింపింది. మూడు ఓవర్లకు కేకేఆర్ వికెట్ నష్టానికి 23 రన్స్ చేసింది. ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్16 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అర్ష్‌దీప్ సింగ్ దెబ్బకు పంబాజ్ ఓకే ఓవర్లో రెండో వికెట్లు కోల్పోయింది. ఆఖరి బంతికి అనుకుల్ రాయ్ (4) ఔటయ్యాడు. కవర్స్‌లో రజా క్యాచ్ పట్టడంతో అనుకుల్ వెనుదిరిగాడు. తొలి బంతికే ఓపెనర్ మన్దీప్ సింగ్ (2) పెవిలియన్ చేరాడు. రహమనుల్లా గుర్బాజ్(11) క్రీజులో ఉన్నాడు.
.@arshdeepsinghh with 2️⃣ wickets in an over 🙌@punjabkingsipl off to a powerful start as they get Mandeep Singh and Anukul Roy early!
Follow the match ▶️ https://t.co/UeBnlhdZdr#TATAIPL | #PBKSvKKR pic.twitter.com/W2kQyab5u3
— IndianPremierLeague (@IPL) April 1, 2023
కోల్‌కతా ఓపెనర్ మన్దీప్ సింగ్ (2) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ ఓవర్లో భారీ షాట్ కొట్టాడు. బౌండరీ వద్ద సామ్ కరన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దాంతో, 13 రన్స్ వద్ద కేకేఆర్ తొలి వికెట్ పడింది. అంతకుముందు ఓవర్లో రహమనుల్లా గుర్బాజ్(11) చెలరేగాడు. సామ్ కరన్ మొదటి ఓవర్ ఐదో బంతిని బౌలర్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి.
కోల్‌కతా ఓపెనర్ రహమనుల్లా గుర్బాజ్(11)మొదటి ఓవర్లోనే చెలరేగాడు. సామ్ కరన్ మొదటి ఓవర్ ఐదో బంతిని బౌలర్ మీదుగా స్టాండ్స్‌లోకి పంపాడు. ఆ తర్వాతి బంతికి ఫోర్ కొట్టాడు. దాంతో, 13 రన్స్ వచ్చాయి. మన్దీప్ సింగ్ (2)క్రీజులో ఉన్నాడు.
కోల్‌కతా ఇన్నింగ్స్ ఆలస్యంగా మొదలు కానుంది. ఫ్లడ్ లైట్స్ వెలగకపోవడమే అందుకు కారణం. స్టేడియంలోని 6 ఫ్లడ్లైట్స్ మాత్రమే వెలిగాయి. దాంతో, మిగతావి ఆన్ కాగానే కోల్‌కతా ఛేజింగ్ షురూ అవుతుంది.
పంజాబ్ కింగ్స్ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా రిషి ధావన్‌ను తీసుకుంది. హాఫ్ సెంచరీ కొట్టిన భానుక రాజపక్సే ప్లేస్‌లో అతడిని తీసుకుంది.
షారుఖ్ ఖాన్(11), సామ్ కరన్(26) ఆఖర్లో ధనాధాన్ బ్యాటింగ్ చేశారు. సౌథీ వేసిన ఆఖరి ఓవర్లో తొలి బంతకి షారుక్ బౌండరీ కొట్టాడు. మూడో బంతిని కరన్ స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో15, రన్స్ వచ్చాయి. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ 191 రన్స్ చేసింది.
పంజాబ్ ఐదో వికెట్ కోల్పోయింది. సునీల్ నరైన్ స్లో డెలివరీతో సికిందర్ రజా (16)ను బొల్తా కొట్టించాడు. కవర్స్‌లో నితీశ్ రానా క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. దాంతో, 168 రన్స్ వద్ద పంజాబ్ ఐదో వికెట్ పడింది. ఆల్‌రౌండర్ సామ్ కరన్(14) రన్స్‌తో క్రీజులో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ సామ్ కరన్(13) దూకుడు పెంచాడు. వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్ ఆఖరి బంతికి లాంగాఫ్‌లో భారీ సిక్సర్ కొట్టాడు. ఆ ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. సికిందర్ రజా (16) రన్స్‌తో క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ 15 ఓవర్లకు పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సికిందర్ రజా(13), సామ్ కరన్(3) క్రీజులో ఉన్నారు. రజా దంచి కొడుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన 15వ ఓవర్లో సిక్స్ బాదాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి.
పంజాబ్ కింగ్స్ కీలక వికెట్ కోల్పోయింది. కెప్టెన్ శిఖర్ ధావన్(40)ను వరుణ్ చక్రవర్తి బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం సికిందర్ రజా, సామ్ కరన్ క్రీజులో ఉన్నారు. 14.3 ఓవర్లకు పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడతన్న జితేశ్ శర్మ(14) సౌథీ ఓవర్లో స్లిప్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు బంతిని అతను సిక్సర్‌గా మలిచాడు. కెప్టెన్ శిఖర్ ధావన్(38) క్రీజులో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ బిగ్ వికెట్ కోల్పోయింది. భానుక రాజపక్సే (50) ఔటయ్యాడు. ఉమేశ్ ఓవర్లో బౌండరీతో ఫిఫ్టీకి చేరువయ్యాడు. కెప్టెన్ శిఖర్ ధావన్(38), జితేశ్ శర్మ(14) ధాటిగా ఆడుతున్నారు. 13 ఓవర్లకు పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 129 రన్స్ చేసింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు షాక్.. 23 రన్స్ వద్ద ఓపెనర్ ప్రభసిమ్రాన్ సింగ్ (23) వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్‌లో గుర్బాజ్ క్యాచ్ పట్టడంతో అతను వెనుదిరిగాడు. శిఖర్ ధావన్, భానుక రాజపక్సే క్రీజులో ఉన్నారు.
ఐపీఎల్ రెండో మ్యాచ్ మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగుతోంది. టాస్ గెలిచిన కేకేఆర్ కెప్టెన్ నితీశ్ రానా ఫీల్డింగ్ తీసుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. శిఖర్ ధావన్, ప్రభసిమ్రాన్ సింగ్ ఓపెనింగ్ చేయనున్నారు.