KK vs LSG : ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది 28వ మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ ఐదు ఓవర్లకే రెండు వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోర్ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు.
రెండో ఓవర్ ఆఖరు బంతికి ఓపెనర్ క్వింటన్ డికాక్ తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో నరైన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటి ఎల్ఎస్జీ స్కోర్ ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు. ఆ తర్వాత ఐదో ఓవర్ నాలుగో బంతికి దీప్ హుడాను స్టార్క్ ఔట్ చేశాడు.
ప్రస్తుతం కెప్టెన్ కేఎల్ రాహుల్ 33 (25 బంతుల్లో ఒక సిక్స్, మూడు ఫోర్లు), ఆయుష్ బదోనీ 18 (18 బంతుల్లో రెండు ఫోర్లు) నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దాంతో తొలి 10 ఓవర్ల ఆట ముగిసే సమయానికి లక్నో రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులతో ఉంది.