దుబాయ్: ఐపీఎల్ మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో లీగ్‌లోకి ప్రవేశించింది. త్వరలో ప్రారంభమవుతున్న దుబాయ్ టీ20 లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. నటుడు షారూక్‌ఖాన్, జూహీ చావ్లా, జై మెహత నేతృత్వంలోని నైట్‌రైడర్స్ గ్రూపు దుబాయ్ లీగ్‌లో ‘అబుదాబి నైట్‌రైడర్స్’ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇటీవల అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ)లో గ్రేటర్ లాస్ఏంజిల్స్ ఫ్రాంచైజీని దక్కించుకునేందుకు ఒప్పందం చేసుకున్న నైట్‌రైడర్స్ ఇప్పుడు యూఏఈ టీ20 లీగ్‌లో అడుగుపెట్టడం విశేషం. ఐపీఎల్ (2008)తోపాటు 2015లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో నైట్‌రైడర్స్ భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని నాలుగు క్రికెట్ టీ20 లీగ్‌ల్లో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీలు పొందడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో కోల్‌కతా నిలకడైన ప్రదర్శన కనబర్చకపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు చేజార్చుకుంది.
నాలుగు లీగ్‌ల్లో
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)తో క్రికెట్ దశ తిరిగింది. పొట్టి ఫార్మాట్లో ఉన్న మజాను ప్రేక్షకులు ఆస్వాదిస్తుండడంతో అనూహ్య స్పందన లభించింది. ఈ టోర్నీలో కోల్‌కతా ఫ్రాంచైజీని నైట్‌రైడర్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. 2012, 14లో చాంపియన్‌గా నిలిచిన నైట్‌రైడర్స్ విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది.
2015లో కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది.
నిరుడు అమెరికాకు చెందిన మేజర్ లీగ్ క్రికెట్ (ఎమ్ఎల్సీ)లో గ్రేటర్ లాస్ఏంజిల్స్ ఫ్రాంచైజీతో ఒప్పందం.
యూఏఈ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్‌రైడర్స్ సొంతం చేసుకున్న నైట్‌రైడర్స్.