మెల్బోర్న్: ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli).. ఆస్ట్రేలియాకు చెందిన ఛానల్ 7 మహిళా రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఫోటోలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించాడు. విమానాశ్రయంలో ఆ మహిళా రిపోర్టర్‌ను కోహ్లీ నిలదీశాడు. తన కుటుంబానికి చెందిన ఫోటోలను అనుమతి లేకుండా తీస్తున్నారని కోహ్లీ అన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన విరాట్.. బాక్సింగ్ డే టెస్ట కోసం మెల్బోర్న్ చేరుకున్నాడు. అయితే విమానాశ్రయంలో ఫ్యామిలీ పిక్స్ తీయడాన్ని కోహ్లీ అడ్డుకున్నాడు. అక్కడే ఉన్న సింగపూర్ అభిమానలు ఆ ఘటనను వీక్షించారు. ఆస్ట్రేలియా మీడియా తన ప్రైవసీని దెబ్బతీస్తున్నట్లు కోహ్లీ ఆరోపించాడు. అయితే చివరకు కెమెరామ్యాన్ క్షమాపణలు చెప్పాడు.
Virat Kohli misbehaves with 7 News Channel reporter
Bad form Bad behavior #ViratKohli pic.twitter.com/BtlvhcuH2Y— Hashim Tufail (@PakistaniH47165) December 19, 2024