Virat Kohli : టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) వన్డేల్లో మరో ఫీట్ సాధించాడు. ఆసియా కప్(Asia Cup 2023)లో పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో సెంచరీ దాడు. దాంతో, విరాట్ 13వేల క్లబ్లో చేరాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో సింగిల్ తీసి కోహ్లీ శతకం పూర్తి చేసుకున్నాడు. దాంతో, వన్డేల్లో 47వ శతకం ఖాతాలో వేసుకున్నాడు.
Fastest to 13000 ODI runs.
Take a bow, @imVkohli 🙌🙌#TeamIndia pic.twitter.com/UOT6HsJRB2
— BCCI (@BCCI) September 11, 2023
దాంతో 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో క్రికెటర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 49 శతకాల రికార్డుకు చేరువగా వచ్చాడు. రికీ పాంటింగ్, రోహిత్ శర్మ 30 వన్డే శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు.