Virat Kohli : అంతర్జాతీయ వన్డేల్లో శతకాల కింగ్‌గా అవతరించిన విరాట్ కోహ్లీ (Virat Kohli) అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు. విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ, అర్ధ శతకంతో మెరిసిన విరాట్.. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమీపిస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకున్నాడు. 50 ఓవర్ల ఫార్మాట్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో మరో మ్యాచ్ ఆడేందుకు రన్ మెషీన్ సిద్ధమవుతున్నాడు. ఈ విషయాన్ని సోమవారం ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ వెల్లడించాడు. దాంతో.. ఈ లీగ్‌లో కోహ్లీ రెండు మ్యాచ్‌లకే పరిమితం అవుతాడనే వార్తలకు చెక్ పడింది.
ఆస్ట్రేలియా పర్యటనలో చివరిదైన సిడ్నీ వన్డేతో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ పరుగుల వరద కొనసాగిస్తున్నాడు. ఈమధ్యే స్వదేశంలో సఫారీలపై వరుసగా రెండు శతకాలు బాదేసిన విరాట్.. దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకమోతతో అలరించాడు. రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై 77 పరుగులతో రాణించిన ఈ ఢిల్లీ బ్యాటర్ మళ్లీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించనున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ సమీపిస్తున్నందున ప్రాక్టీస్ కోసమని వీహెచ్‌టీలో మరో మ్యాచ్ ఆడేందుకు ఓకే చెప్పాడు. దాంతో.. టీమిండియా స్టార్ పరుగుల విందుకు అభిమానులు రెఢీ అవుతున్నారు.
🚨 KOHLI LOCKED IN FOR VHT. 🚨
– Virat Kohli available for the Vijay Hazare Trophy match against Railways on 6th January. (Cricbuzz). pic.twitter.com/s4yfEw5APk
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2025
‘ఇప్పటికైతే కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు. మూడు మ్యాచ్‌లు ఆడుతానని అతడు ఇదివరకే చెప్పాడు’ అని రోహన్ జైట్లీ తెలిపాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జనవరి 6న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభం కానుంది. పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన కోహ్లీ రెండు మ్యాచుల్లో 131, 77 స్కోర్లతో చెలరేగాడు. తద్వారా లిస్ట్ – ఏ క్రికెట్లో అత్యధిక సగటు నమోదు చేశాడు.
కోహ్లీ, మైఖేల్ బెవాన్
ఆస్ట్రేలియా మాజీ ఫినిషర్ మైఖేల్ బెవాన్ (Michael Bevan) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. బెవాన్ సగటు లిస్ట్ ఏ క్రికెట్లో 57.86 కాగా.. కోహ్లీ 57.87తో అతడిని అధిగమించాడు. అంతేకాదు లిస్ట్-ఏ క్రికెట్లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బద్దలు కొడుతూ అత్యల్ప మ్యాచుల్లోనే 16 వేల క్లబ్లో చేరాడు విరాట్. ప్రస్తుతం 343 మ్యాచుల్లో 57.60 సగటుతో 16,130 రన్స్ బాదాడు. ఇందులో 58 సెంచరీలు, 84 అర్ధ శతకాలు ఉన్నాయి.