IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ప్రతీకార విజయం సాధించింది. చిన్నస్వామిలో తమను చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్(Punjab Kings)పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత సుయాశ్ శర్మ(2-26), కృనాల్ పాండ్యా(2-25)ల విజృంభణతో పంజాబ్‌ను 157 కట్టడి చేసిన ఆర్సీబీ.. ఛేదనలో చెలరేగింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విరాట్ కోహ్లీ(73 నాటౌట్) ఇప్యాంక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(61)లు హాఫ్ సెంచరీలతో హోరెత్తించారు. జితేశ్ శర్మ(11) సిక్సర్ బాదడంతో మరో 7 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది బెంగళూరు.
సొంతగడ్డపై చతికిలపడుతూ.. ఇతర మైదానాల్లో విజయఢంకా మోగిస్తున్న ఆర్సీబీ అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. పంజాబ్ కింగ్స్‌ను వాళ్ల ఇలాకాలో చిత్తుగా ఓడించి బదులు తీర్చుకుంది. 158 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ(73 నాటౌట్) క్లాస్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా.. ఇప్యాంక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్(61) ఖతర్నాక్ బ్యాటింగ్‌తో చెలరేగాడు. వీళ్లిద్దరి మెరుపులతో గెలుపు దిశగా దూసుకెళ్లిన ఆర్సీబీ.. 18.5 ఓవర్లోలనే లక్ష్యాన్ని చేరుకుని శ్రేయస్ అయ్యర్ బృందానికి పెద్ద షాకిచ్చింది.
Smacking them with ease 🤌
Virat Kohli is in the mood to finish this early 🔥
Updates ▶ https://t.co/6htVhCbTiX#TATAIPL | #PBKSvRCB | @imVkohli pic.twitter.com/iuT58bJY2A
— IndianPremierLeague (@IPL) April 20, 2025
ముల్లనూర్‌లో పంజాబ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన ఆర్సీబీకి ఆదిలోనే అర్ష్‌దీప్ సింగ్ షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ ఫిల్ సాల్ట్(1)ను తన తొలి ఓవర్లోనే వెనక్కి పంపాడు. అయితే.. జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న విరాట్ కోహ్లీ(73 నాటౌట్), ఇంప్యాక్ట్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్(61)తో కలిసి ధాటిగా ఆడాడు. చిన్నస్వామిలో నిప్పులు చెరిగిన పంజాబ్ పేసర్లు ఈసారి తేలిపోగా.. విరాట్, పడిక్కల్ బౌండరీలతో విరుచుకుపడ్డారు. 30 బంతుల్లోనే అర్ద శతకం బాదిన పడిక్కల్ ఔటైనా.. విరాట్ మరింత చెలరేగాడు.
WATCH Devdutt Padikkal’s stylish 61 (35) 🔽🎥https://t.co/mLBSm0c5HA#TATAIPL | #PBKSvRCB | @RCBTweets https://t.co/qmbe9slgbu
— IndianPremierLeague (@IPL) April 20, 2025
అర్ష్‌దీప్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన అతడు.. ఆ తర్వాత చాహల్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టాడు. అయితే.. రజత్ పాటిదార్ సిక్సర్‌కు యత్నించి బౌండరీ లైన్‌వద్ద యాన్సెన్‌కు చిక్కాడు. అప్పటికి ఆర్సీబీ విజయానికి 15 రన్స్ అవసరం. నేహల్ వధేరా వేసిన 19వ ఓవర్లో జితేశ్ శర్మ(11 నాటౌట్) సిక్సర్ కొట్టి జట్టును గెలిపించాడు. దాంతో, ఈ ఎడిషన్‌లో ఐదో విజయం బెంగళూరు ఖాతాలో పడింది.
సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ ఆరంభం అదిరినా భారీ స్కోర్ కొట్టలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో… టాపార్డర్ విఫలమైంది. సుయాశ్ శర్మ(2-26), కృనాల్ పాండ్యా(2-25)లు తిప్పేయడంతో మిడిలార్డర్ చేతులెత్తేసింది. వందలోపే నాలుగు వికెట్లు కోల్పోయిన పంజాబ్‌ను జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్(31 నాటౌట్), మార్కో యాన్సెన్(25)లు ఆదుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న శశాంక్, యాన్సెన్ డెత్ ఓవర్లలో విలువైన ఇన్నింగ్స్ ఆడారు. ఏడో వికెట్‌కు 43 రన్స్ జోడించిందీ ద్వయం. దాంతో, పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.