ఒక ఆట ఒలింపిక్ స్పోర్ట్‌గా ఎలా గుర్తింపు పొందుతుందో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్ద స్పోర్టింగ్ ఈవెంట్ ఒలింపిక్స్ మరో 9 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి వేలాది మంది అథ్లెట్లు పాల్గొనే అత్యున్నత క్రీడా వేదిక ఒలింపిక్స్. ఈసారి జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తోంది. గతేడాదే జరగాల్సిన ఈ గేమ్స్ కరోనా కారణంగా ఈ ఏడాది జులై 23కు వాయిదా పడ్డాయి. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉండటంతో అభిమానులు లేకుండానే గేమ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి.
- ప్రాచీన ఒలింపిక్స్ తొలిసారి క్రీస్తుపూర్వం 776లో గ్రీకు దేవత జ్యూస్ గౌరవార్థం జరిగాయి.
- ఇక తొలి ఆధునిక ఒలింపిక్స్ కూడా గ్రీస్‌లోని ఏథేన్స్‌లో 1896లో జరిగాయి.
- ఒలింపియా అనే సిటీలో తొలిసారి జరిగాయి కాబట్టి వీటికి ఒలింపిక్స్ అనే పేరు వచ్చింది.
- ఆధునిక ఒలింపిక్స్ పితామహుడిగా పియెరె డి కూబెర్టిన్‌ను అభివర్ణిస్తారు.
- కూబెర్టినే 1894లో ఇంటర్నేషన్ ఒలింపిక్ కమిటీని స్విట్జర్లాండ్‌లోని లాసానెలో ఏర్పాటు చేశారు.
- ఒలింపిక్స్ నినాదం సిటియస్-ఆల్టియస్-పోర్టియస్ (వేగం-ఉన్నతం-బలం)
- ఒలింపిక్స్‌లోని ఐదు ఖండాలకు సూచికగా ఉన్న ఐదు రింగులు ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు పచ్చ, నలుపు రంగుల్లో ఉంటాయి.
- తొలిసారి ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ 1908 లండన్ గేమ్స్‌లో జరిగింది.
- ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీలో ఎప్పుడూ అన్ని టీమ్స్ కంటే ముందు గ్రీస్ ఉంటుంది. చివరి టీమ్‌గా ఆతిథ్య దేశం ఉంటుంది.
- 1916, 1940, 1944లలో ప్రపంచ యుద్ధాల కారణంగా ఒలింపిక్స్ జరగలేదు.
- మహిళలు తొలిసారి 1900లో పారిస్ గేమ్స్‌లో పాల్గొన్నారు.
- 1896లో జరిగిన తొలి ఒలింపిక్స్‌లో అత్యధికంగా గ్రీస్ 47 మెడల్స గెలిచింది.
- ఒలింపిక్ జ్యోతి తొలిసారిగా 1928 ఆమ్స్టర్డ్యామ్ గేమ్స్‌లో కనిపించింది.
- ఇప్పటి వరకూ రెండేసిసార్లు ఒలింపిక్స్‌ను నిర్వహించిన నగరాల లిస్ట్‌లో ఏథేన్స్ (1896, 2004), పారిస్ (1900, 1924), లాస్ ఏంజిల్స్ (1932, 1984) ఉన్నాయి.
- లండన్ (1908, 1948, 2012) మూడుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది.
- అత్యధికంగా అమెరికా నాలుగుసార్లు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చింది.
- ఒక క్రీడ ఒలింపిక్ స్పోర్ట్‌గా అర్హత సాధించాలంటే దానిని పురుషులైతే కనీసం నాలుగు ఖండాల్లోని 75 దేశాల్లో ఆడుతుండాలి. ఇక మహిళలైతే మూడు ఖండాల్లోని 40 దేశాలు ఆడుతుండాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

