IPL 2025 : మూడు వికెట్లు పడినప్పటికీ సన్‌రైజర్స్ బ్యాటర్లు ఒత్తిడికి లోనవ్వకుండా ఆడుతున్నారు. ఓపెనర్ అభిషేక్ శర్మ(59) మెరుపు హాఫ్ సెంచరీతో మంచి పునాది వేయగా.. ఆ తర్వాత ఇషాన్ కిసన్(35) ధనాధన్ ఆడాడు. అయితే.. మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ రథీ(2-37 ) ఈ ఇద్దరిని ఔట్ చేసి లక్నోకు బ్రేకిచ్చాడు. అయితే.. హెన్రిచ్ క్లాసెన్(34 నాటౌట్)కు జతగా కుశాల్ మెండిస్(29 నాటౌట్) దంచుతున్నాడు. ఇద్దరూ వికెట్ల మధ్య వేగంగా పరుగెడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తున్నారు. దాంతో, సన్‌రైజర్స్ విజయానికి చేరువైంది. 16 ఓవర్లకు స్కోర్.. 179-3. ఇంకా కమిన్స్ సేన విజయానికి 24 బంతుల్లో 27 పరుగులు కావాలి.
భారీ ఛేదనలో ఓపెనర్ అథర్వ తైడే(13) త్వరగానే ఔటైనా అభిషేక్ శర్మ() సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలతో విరుచుకుపడి లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. పవర్ ప్లేలో ఇషాన్ కిషన్(35)తో కలిసి జట్టు స్కోర్ 7 దాటించాడు. అనంతరం స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో రెచ్చిపోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ సిక్సర్లతో లక్నో స్టేడియాన్ని హోరెత్తించాడు. పవర్ ప్లే తర్వాతి ఓవర్ వేసిన ఈ లెగ్ స్పిన్నర్‌కు చుక్కలు చూపిస్తూ వరుసగా 4 బంతుల్ని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, 18 బంతుల్లోనే అర్ధ శతకానికి చేరువయ్యాడీ హిట్టర్.
When Abhishek Sharma decided to make the ball fly 🚀
🎥 A glimpse of his onslaught during a blistering 59(20) 🔥
Updates ▶ https://t.co/GNnZh911Xr#TATAIPL | #LSGvSRH | @SunRisers pic.twitter.com/92w8j21Niw
— IndianPremierLeague (@IPL) May 19, 2025
అయితే.. అనంతరం దిగ్వేశ్ బౌలింగ్‌లో పెద్ద షాట్ ఆడిన అభి.. బౌండరీ వద్ద శార్దూల్ చేతికి దొరికాడు. దాంతో, ఆరెంజ్ ఆర్మీ 99 వద్ద రెండో వికెట్ కోల్పోయింది. కాసేపటికే దిగ్వేశ్ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడబోయిన ఇషాన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో క్లాసెన్, కుశాల్ మెండిస్ జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నారు. దిగ్వేశ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కుశాల్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ వైపు తిప్పాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 27 బంతుల్లో 39 పరుగులు సాధించారు.