న్యూఢిల్లీ: లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul).. ఐపీఎల్ 2023 సీజన్లో మిగితా మ్యాచ్‌లు దూరం అయ్యాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ రాహుల్‌ను మిగితా మ్యాచ్‌లకు దూరం పెట్టేశారు. దీంతో అతను జూన్‌లో ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను కూడా మిస్‌కానున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ సమయంలో రాహుల్ కుడి కాలిలో కండరాలకు గాయమైంది. ఆ మ్యాచ్‌లో అతను ఫీల్డింగ్ చేయలేకపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో చివరలో వచ్చిన రాహుల్ ఏమీ స్కోర్ చేయలేకపోయాడు. సీఎస్కేతో మ్యాచ్ కోసం ముంబై వెళ్లిన రాహుల్ అక్కడ స్కానింగ్ చేయించుకున్నారు.
With you through thick and thin, KL. 🫶
Full story 👇
— Lucknow Super Giants (@LucknowIPL) May 5, 2023
అయితే అతని గాయం సీరియస్‌గా ఉన్నట్లు తేలింది. దాంతో అతనికి రెస్ట్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. రాహుల్‌పై లక్నో జట్టు ట్వీట్ చేసింది. కెప్టెన్ రాహుల్‌కు సర్జరీ అవసరమని, అతనికి లాంగ్ బ్రేక్ కూడా తప్పదని పేర్కొన్నది. రాహుల్‌కు కావాల్సినంత సపోర్టు ఇస్తున్నామని, అతను త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు లక్నో టీమ్ తెలిపింది.