IPL 2025 : ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న కేఎల్ రాహుల్(51) అర్ధ శతకం సాధించాడు. యశ్ దయాల్ వేసిన 14వ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ కొట్టి జట్టును ఆదుకున్నాడు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి 58కే నాలుగు వికెట్లు పడిన దశలో రాహుల్ సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(15)తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పుతున్న రాహుల్ జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. 14 ఓవర్లకు ఢిల్లీ స్కోర్.. 99-4.
ఆర్సీబీ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే కష్టాల్లో పడింది. 3 ఓవర్లకే ఓపెనర్లు ఇద్దరూ పెవిలియన్ చేరారు. యశ దయాల్ బౌలింగ్‌లో ఫాఫ్ డూప్లెసిస్(2) రజత్ పటిదార్‌కు క్యాచ్ ఇచ్చాడు. కాసేపటికే ఫ్రేజర్ మెక్‌గుర్క్(7)ను భువనేశ్వర్ వెనక్కి పంపాడు. జితేశ్ శర్మ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 10 వద్దనే ఢిల్లీ 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇంప్యాక్ట్ ప్లేయర్ అభిషేక్ పొరెల్(7), అక్షర్ పటేల్(15)లు ధాటిగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకున్నారు.