KL Rahul | పునరాగమనం మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించిన రాహుల్
KL Rahul : భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) పునరాగమనంలోనే రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 2వేల పరుగుల క్లబ్(2,000 Runks Club)లో చేరాడు. అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరిన మూడో భారత క్రికెట్‌గా రికార్డు నెలకొల్పాడు. దాంతో, విరాట్ కోహ్లీ(Virat Kohli)...
KL Rahul : భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్(KL Rahul) పునరాగమనంలోనే రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 2వేల పరుగుల క్లబ్(2,000 Runks Club)లో చేరాడు. అంతేకాదు 50 ఓవర్ల ఫార్మాట్లో తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరిన మూడో భారత క్రికెట్‌గా రికార్డు నెలకొల్పాడు. దాంతో, విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును రాహుల్ సమం చేశాడు. అవును.. రాహుల్, కోహ్లీ ఇద్దరూ 53వ ఇన్నింగ్స్‌లో 2,000 రన్స్ కొట్టారు.
ఆసియా కప్ (Asia Cup 2023)లో దాయాది పాకిస్థాన్‌తో సూపర్ 4 మ్యాచ్‌కు ముందు రాహుల్ 2వేలకు 14 పరుగుల దూరంలో ఉన్నాడు. శుభ్‌మన్ గిల్ ఔటయ్యాక నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను 18 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్

2000 ODI runs and counting for @klrahul 🙌
Live – https://t.co/Jao6lKkWs5… #INDvPAK #AsiaCup2023 pic.twitter.com/We2YfX06gA
— BCCI (@BCCI) September 10, 2023
పాక్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు 24 పరుగులు జోడించాడు. అయితే.. 24.1వ ఓవర్ సమయానికి వర్షం అంతరాయం కలిగించడంతో ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లారు. అప్పటికీ టీమిండియా స్కోర్.. 147/2.
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయిన ఐపీఎల్ 16వ సీజన్లో ఫీల్డింగ్ చేస్తుండగా గాయపడ్డాడు. దాంతో, టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో కోలుకున్న రాహుల్ ఈమధ్యే ఫిట్నెస్ సాధించాడు. ఆసియా కప్‌లో నేపాల్, పాక్ మ్యాచ్‌లకు దూరమైన రాహుల్ ఈరోజు జట్టుతో కలిశాడు. శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో తుది జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
ఇవి కూడా చదవండి
Asia cup 2023 | ఓవర్లు కుదిస్తే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్..?
Coco Gauff | బాస్కెట్ బాల్ వదిలేసి.. రాకెట్ పట్టింది.. నయా చాంపియన్ స్టోరీ ఇది
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

