Asia cup 2023 | ఓవర్లు కుదిస్తే.. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాకిస్థాన్ టార్గెట్..?
Asia cup 2023 : ఆసియా కప్‌లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) సూపర్ 4 మ్యాచ్‌కు పూర్తిగా సాగేలా లేదు. వర్షం కారణంగా ఇప్పటికే గంటకుపైగా ఆట నిలిచిపోయింది. ఒకవేళ వాన తగ్గినా కూడా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండడంతో ఓవర్లను కుదించే అవకాశం ఉంది. అయితే.. 7:30కి ఓసారి అంపైర్లు పిచ్‌ను....
Asia cup 2023 : ఆసియా కప్‌లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) సూపర్ 4 మ్యాచ్‌కు పూర్తిగా సాగేలా లేదు. వర్షం కారణంగా ఇప్పటికే గంటకుపైగా ఆట నిలిచిపోయింది. ఒకవేళ వాన తగ్గినా కూడా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండడంతో ఓవర్లను కుదించే అవకాశం ఉంది. అయితే.. 7:30కి ఓసారి అంపైర్లు పిచ్‌ను పరిశీలించనున్నారు. అప్పటికీ పిచ్ అనుకూలంగా లేకుంటే మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్(Duckworth-Lewis) ప్రకారం 20 ఓవర్లకు కుదిస్తారు. అదే జరిగితే.. ఆ పాకిస్థాన్‌కు 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించనున్నారు.
ఊహించినట్టుగానే భారత్, పాక్ మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. 24.1వ ఓవర్ సమయంలో వాన మొదలైంది. దాంతో, గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశారు. అప్పటికీ భారత్ స్కోర్.. 147/2. విరాట్ కోహ్లీ(8), కేఎల్ రాహుల్(17) ఆడుతున్నారు.
శుభ్‌మన్ గిల్(58), రోహిత్ శర్మ(56)

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్ వెంట వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ(56 : 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఔటైన తర్వాతి ఓవర్లోనే శుభ్‌మన్ గిల్(58 : 52 బంతుల్లో 10 ఫోర్లు) వెనుదిరిగాడు. షాహీన్ ఆఫ్రీదీ ఓవర్లో అఘా సల్మాన్ చేతికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దాంతో, 124 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది.
ఇవి కూడా చదవండి
Coco Gauff | బాస్కెట్ బాల్ వదిలేసి.. రాకెట్ పట్టింది.. నయా చాంపియన్ స్టోరీ ఇది
Rohit Sharma | వన్డేల్లో 50వ ఫిఫ్టీ.. ఆస్ట్రేలియా దిగ్గజం సరసన హిట్‌మ్యాన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

