ముంబై: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్(ODI World Cup 2023) కోసం ఇవాళ 15 బంది సభ్యుల టీమిండియా బృందాన్ని ప్రకటించారు. ఆ జాబితాలో ఏడుగురు బ్యాటర్లు ఉన్నారు. నలుగురు బౌలర్లు, మరో నలుగురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న ప్లేయర్లు అందరూ దాదాపు .. వరల్డ్‌కప్ జట్టులో ఉన్నారు. అయితే వికెట్ కీపింగ్ బాధ్యతల్ని ఎవరు చేపడుతారన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ .. వరల్డ్‌కప్‌లో కీపింగ్ స్థానం కోసం ఎంపిక చేశారు. ఇక ఆ స్థానం కోసం ఇషాన్ కిషన్ కూడా జట్టు కూర్పులో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి తుది స్థానం దక్కుతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. అయితే కేఎల్ రాహుల్.. అయిదో స్థానంలో రన్స్ బాగా స్కోర్ చేస్తాడని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. కీపింగ్ విషయంలో ఇద్దరితోనూ చర్చించనున్నట్లు అగార్కర్ తెలిపాడు. గాయం నుంచి కోలుకుంటున్న రిషబ్ పంత్‌ను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయలేదు.
వరల్డ్‌కప్ బృందంపై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కామెంట్ చేశారు. ఈ సారి వరల్డ్‌కప్‌కు కొందరు ప్లేయర్లు మిస్ అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిసారి వరల్డ్‌కప్ సమయంలో ఇదే జరుగుతుందన్నారు. దీంట్లో ఎటువంటి ఆశ్చర్యం ఏమీ లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఉత్తమ కాంబినేషన్ ఎంపిక చేశామని, బ్యాటింగ్‌లో చాలా డెప్త్ ఉందని, స్పిన్‌తో పాటు ఇతర బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయని, అయితే ఆటగాళ్ల ఫామ్, ప్రత్యర్థి జట్ల సవాల్‌ను బట్టి మ్యాచ్‌కు ముందు తుది జట్టు ఎంపిక జరుగుతుందని కెప్టెన్ రోహిత్ తెలిపాడు. వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపిక చేశామని, ఎవరికైనా గాయం అయితే తప్ప, మరో మార్పు ఉండదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు.
ఆసియా కప్‌కు దూరమైన లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్‌ను.. వరల్డ్‌కప్‌కు కూడా పక్కనపెట్టేశారు. మేటి బ్యాటర్ శిఖర్ ధావన్‌ను కూడా వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేయలేదు. గత పదేళ్ల నుంచి అతను అన్ని వరల్డ్‌కప్‌లు ఆడాడు. ఈసారి మాత్రం ధావన్‌కు ఛాన్స్ దక్కలేదు.