సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన వెంకటేశ్ అయ్యర్ (7) నిరాశ పరిచాడు. మార్కో జాన్సెన్ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని ఆడటానికి ప్రయత్నించిన వెంకటేశ్.. దాన్ని తన వికెట్ల మీదకు ఆడుకున్నాడు. బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. దీంతో రెండో ఓవర్లోనే 17 పరుగుల వద్ద కోల్‌కతా తొలి వికెట్ కోల్పోయింది.