కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్‌కు తొలి ఎదురు దెబ్బ తగిలింది. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (2) నిరాశ పరిచాడు. ఉమేష్ యాదవ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికే అతను వెనుతిరిగాడు. ఉమేష్ వేసిన బంతిని ఆఫ్‌సైడ్ ఆడేందుకు ప్రయత్నించిన పడిక్కల్.. అంచనా మిస్ అవడంతో బంతి గాల్లోకి లేచి నేరుగా వెళ్లింది.
బౌలింగ్ చేసి ముందుకు వస్తున్న ఉమేష్ దాన్ని ఒక చేత్తో అడ్డుకొని కింద పడకముందే పట్టేశాడు. దాంతో పడిక్కల్ నిరాశగా మైదానం వీడాడు. దీంతో రాజస్థాన్ జట్టు 7 పరుగులకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.