గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మరో వికెట్ కోల్పోయింది. గత రెండు మ్యాచుల్లో వికెట్లు తీయని రషీద్ ఖాన్.. ఈ మ్యాచ్‌లో కీలక వికెట్ తీశాడు. వెంకటేశ్ అయ్యర్ (17)ను అవుట్ చేశాడు. రషీద్ ఖాన్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి భారీ షాట్ ఆడేందుకు అయ్యర్ ప్రయత్నించాడు. దాన్ని బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న అభినవ్ మనోహర్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టే సమయంలో బౌండరీ కుషన్‌కు అభినవ్ కాలు తగిలిందేమో? అని అంపైర్లు అనుమానించారు.
థర్డ్ అంపైర్ చెక్ చేసి అభినవ్ కాలు.. బౌండరీకి తగిలినట్లు లేదని చెప్పాడు. దాంతో వెంకటేశ్ పెవిలియన్ చేరాడు. ఇది రషీద్ ఖాన్‌కు ఐపీఎల్లో 100వ వికెట్ కావడం గమనార్హం. దీంతో కోల్‌కతా జట్టు 98 పరుగుల వద్ద ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 58 పరుగులు కావలసి ఉంది. అయితే క్రీజులో ఆండ్రీ రస్సెల్ ఉండటంతో ఆ జట్టుకు ఇంకా విజయావకాశాలు ఉన్నాయి.
What a catch from Abhinav Manohar!#AbhinavManohar #KKRvGT #KKRvsGT #IPL2022 #IPL #CricketTwitter pic.twitter.com/55RqeQQr2z
— Cricket Winner (@cricketwinner_) April 23, 2022