కోల్కతా నైట్ రైడర్స్ మరో వికెట్ కోల్పోయింది. టాపార్డర్ పూర్తిగా విఫలం అవడంతో జట్టును గెలిపించడానికి ప్రయత్నించిన రింకు సింగ్ (35) అవుటయ్యాడు. యష్ దయాళ్ వేసిన ఇన్నింగ్స్ పదమూడో ఓవర్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రింకు.. బంతిని సరిగా అంచనావేయలేకపోయాడు. దాంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ సాహా అందుకోవడంతో రింకు వెనుతిరిగాడు. రింకు అవుటవడంతో ఆండ్రీ రస్సెల్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం క్రీజులో రస్సెల్, వెంకటేశ్ అయ్యర్ ఉన్నారు.