గుజరాత్ టైటన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమిపాలైంది. టాపార్డర్ పూర్తిగా విఫలమైనా చివరి వరకూ పోరాడిన కేకేఆర్.. 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఓపెనర్లు సునీల్ నరైన్ (5), శామ్ బిల్లింగ్స్ (4), నితీష్ రాణా (2), శ్రేయాస్ అయ్యర్ (12), వెంకటేశ్ అయ్యర్ (17) విఫలమవడంతో ఆ జట్టు ఏ కోశానా గెలిచేలా కనిపించలేదు. అయితే రింకు సింగ్ (35) కాసేపు పోరాడాడు. చివర్వలో ఆండ్రీ రస్సెల్ (48) విరుచుకుపడటంతో కేకేఆర్ గెలుస్తుందేమో అనిపించింది.
చివరి ఓవర్లో 18 పరుగులు కావలసిన స్థితిలో తొలి బంతికే సిక్సర్ కొట్టిన రస్సెల్.. గెలుపుపై ఆశలు రేపాడు. అయితే ఆ తర్వాతి బంతికే ఫెర్గూసన్ అందుకున్న సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. దీంతో కోల్‌కతా ఓటమి ఖరారైంది. చివర్వలో ఉమేష్ యాదవ్ (15 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, యష్ దయాళ్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు తీసుకోగా.. అల్జారీ జోసెఫ్, లోకీ ఫెర్గూసన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానాకి చేరింది.