Kiran Navgire | ధోనీ నా ఆరాధ్య క్రికెటర్.. అతనిలా సిక్స్‌లు కొట్టాలని బ్యాట్ పట్టకున్నా : యూపీ వారియర్స్ ప్లేయర్
స్వదేశంలో 2011లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎంతోమందిని క్రికెట్ బ్యాట్ పట్టేలా చేసింది. అందులో యూపీ వారియర్స్ ప్లేయర్ కిరణ్ నవ్‌గిరే ఒకరు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న రాత్రి గుజరాత్ జెయింట్స్‌పై కిరణ్ స్ట్రోక్ ప్లేతో అలరించింది. ధోనీ తన ఆరాధ్య క్రికెటర్ అని మ్యాచ్ అనంతరం ఆమె జియో సినిమాతో తెలిపింది.
Kiran Navgire : భారత క్రికెట్లో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ ఇన్నింగ్స్‌ను క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ దిగ్గజ ప్లేయర్ కొట్టిన విన్నింగ్ సిక్స్ ఎంతోమందిని క్రికెట్ బ్యాట్ పట్టేలా చేసింది. అందులో యూపీ వారియర్స్ ప్లేయర్ కిరణ్ నవ్‌గిరే ఒకరు. మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న రాత్రి గుజరాత్ జెయింట్స్‌పై కిరణ్ స్ట్రోక్ ప్లేతో అలరించింది.
భారీ సిక్స్‌లు కొట్టిన ఆమె ఎంఎస్ ధోనీ తన ఆరాధ్య క్రికెటర్ అని మ్యాచ్ అనంతరం జియో సినిమాతో తెలిపింది. ఈ మ్యాచ్‌లో ఆమె 43 బంతుల్లో 53 రన్స్ బాదిన జట్టు విజయానికి తోడ్పడింది. ఆమె బ్యాట్‌పై ఎంఎస్డీ 07 అని రాసి ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. 07 అనేది ధోనీ జెర్సీ నంబర్.
ఆ విషయం తెలియదు
‘భారత పురుషుల జట్టు 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ చూశాను. అప్పటి జట్టులో ధోనీ గొప్ప ఆటగాడు. అప్పటి నుంచి ధోనీని అనుసరించడం మొదలు పెట్టా. అయితే.. ఆ సమయంలో మహిళల క్రికెట్ అనేది ఉందనే విషయం తెలియదు. పురుషుల క్రికెట్ జట్టును చూసి మా ఊళ్లోని అబ్బాయిలతో క్రికెట్ ఆడేదాన్ని. అంతేకాదు నేను క్రికెట్ ఆడాలనుకోవడానికి ప్రధాన కారణం.. ఏంటంటే..? ధోనీలా సిక్స్‌లు కొట్టాలనుకోవడం. ఆ రోజు నుంచి నా జీవితం చాలా మారిపోయింది’ అని ఈ కిరణ్ చెప్పుకొచ్చింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్లో ధోనీ సిక్సర్‌తో టీమిండియాను గెలిపించాడు. దాంతో, రెండోసారి భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. 1983లో కపిల్ దేవ్ కెప్టెన్సీలోని భారత జట్టు వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుంది.
కిరణ్, హ్యారిస్ హాఫ్ సెంచరీ
డీవై పాటిల్ స్టేడియంలో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ విజయం సాధించింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో యూపీ జట్టు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో కిరణ్ (53), హ్యారిస్ (59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో యూపీ విజేతగా నిలిచింది. దాంతో, గుజరాత్ వరుసగా రెండో ఓటమి మూటగట్టుకుంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ వేలంలో యూపీ వారియర్స్ కిరణ్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
Kiran Navgire of the UP Warriorz mirroring MSD’s footsteps…@UPWarriorz @msdhoni @GujaratGiants #TATAWPL #KiranNavgire #TATAWPL2023 #WPL2023 #UPWarriorz #GujaratGiants #SportsTak pic.twitter.com/N0XKP4eWKI
— Sports Tak (@sports_tak) March 6, 2023
ఇవి కూడా చదవండి
Sony Sports | శ్రీలంక క్రికెట్ ప్రసార హక్కులు సోనీ స్పోర్ట్స్ చేతికి.. ఎంతకో తెలుసా..?
Fourth Test: స్టీవ్ స్మిత్‌కే పగ్గాలు.. అతిథిగా ప్రధాని ఆంథోనీ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

