ఫులర్టన్ : భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌కు ప్రవేశించాడు. ఆదివారం రసవత్తరంగా సాగిన పురుషుల సింగిల్స్ సెమీస్‌లో శ్రీకాంత్.. 22-20, 15-21, 21-19తో ప్రపంచ 33వ ర్యాకర్ యుడాయ్ ఒకిమొటొ (జపాన్)ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.
ఇక టోర్నీ ఆసాంతం రాణించిన రౌనక్ చౌహాన్‌తో పాటు మహిళల సింగిల్స్‌లో దేవికా సిహాగ్ సెమీస్‌లో పరాజయం పాలయ్యారు.