LSG vs DC : ఐపీఎల్ పదిహేడో సీజన్లో వరుసగా మూడు విజయాలతో జోరుమీదున్న లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)కు ఆదిలోనే షాక్ తగిలింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది. డేంజరస్ ఓపెనర్ క్వింటన్ డికాక్(19), త్ పడిక్కల్(3)లు ఔటయ్యారు.
𝙆𝙡𝙖𝙨𝙨𝙮! 💥
MAXIMUM result for the #LSG captain KL Rahul 👌👌
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #LSGvDC pic.twitter.com/TnZZHi6eOO
— IndianPremierLeague (@IPL) April 12, 2024
ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన డికాక్.. అతడి ఓవర్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో, 28 పరుగులు వద్ద లక్నో తొలి వికెట్ పడింది. అనంతరం పడిక్కల్‌ను ఔట్ చేసి లక్నోను దెబ్బకొట్టాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(16), మార్కస్ స్టోయినిస్(0)లు ఆడుతున్నారు.