NZW vs BANW : స్వల్ప ఛేదనలో బంగ్లాదేశ్ ఆదిలోనే కష్టాల్లో పడింది. శుభారంభం ఇవ్వాల్సిన ఓపెనర్లు నిరాశపరిచగా.. కాసేపటికే ఫామ్‌లో ఉన్న శోభన మొస్త్రే(2) కూడా వెనుదిరిగింది. పవర్ ప్లే చివరి ఓవర్లో ఆమెను జెస్ కేర్ బోల్తా కొట్టించింది. గాల్లోకి లేచిన బంతిని సోఫీ డెవినె ఒడుపుగా అందుకుంది దాంతో.. మూడో వికెట్ కోల్పోయిన బంగ్లా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం కెప్టెన్ నిగర్ సుల్తానా (1), కొత్త బ్యాటర్ సుమైయా అక్తర్ క్రీజులో ఉన్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 22-3.
వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్‌లో అదరగొడుతున్న బంగ్లాదేశ్ బ్యాటింగ్‌లో తేలిపోతోంది. గత రెండు మ్యాచుల్లోనూ టాపార్డర్ వైఫల్యంతో న్యూజిలాండ్‌ను కట్టడి చేసిన బంగ్లా ఛేదనలో తడబడుతోంది. కివీస్ పేసర్ మైర్ ఆదిలోనే ఓపెనర్ షర్మిన్ అక్తర్(3)ను ఔట్ చేసి బ్రేకిచ్చింది.
Rosemary Mair, wow 🔥pic.twitter.com/rp6PmjBb6Y
— ESPNcricinfo (@ESPNcricinfo) October 10, 2025
ఆ తర్వాత వికెట్ కాపాడుకునేందుకు అపసోపాలు పడిన రుబియా హైదర్(4)ను జెస్ కేర్ వెనక్కి పంపింది. దాంతో.. 13 పరుగులకే బంగ్లా రెండో వికెట్ పడింది. ఓపెనర్లు డగౌట్ చేరడంతో కెప్టెన్ నిగర్ సుల్తానా (1), శోభన మొస్త్రే (3)లు జట్టును ఆదుకోవాలనుకున్నారు. దాంతో,, బౌండరీలు కొట్టే సాహసం చేయలేదు వీళ్లు. కానీ, పవర్ ప్లే చివరి ఓవర్లో కేర్ మరోసారి దెబ్బకొడుతూ డేంజరస్ శోభన వికెట్ సాధించింది. అంతే.. బంగ్లా కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.