Karun Nair : ‘క్రికెట్ నాకో అవకాశం ఇవ్వు’ అంటూ టెస్టు జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair) అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనతో ఎనిమిదేళ్ల తర్వాత పునరాగమనం చేసిన అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఇంకేముంది..అతడి స్థానంలో కుర్రాడు దేవ్‌దత్ పడిక్కల్ వెస్టిండీస్ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అంచనాలను అందుకోలేకపోవడంతోనే నాయర్‌ను తప్పించామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) చెప్పడంతో నాయర్‌కు మరో ఛాన్స్ కష్టమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెస్టు స్క్వాడ్‌లో లేకపోవడంపై నాయర్ స్పందించాడు.
‘వెస్టిండీస్‌తో సిరీస్‌కు నన్ను ఎంపిక చేస్తారని ఆశించాను. స్క్వాడ్‌లో నా పేరు లేకపోవడంతో ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అసలు మాటలే రావడం లేదు. నన్ను ఎందుకు తప్పించారు? అనే విషయంపై కామెంట్ చేయదలచుకోవడం లేదు. చెప్పాలంటే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది. సెలెక్టర్ల మనసులో ఏముందో వాళ్లనే అడగండి. ఓవల్ టెస్టులో అందరూ విఫలమైనా హాఫ్ సెంచరీ సాధించాను. నావంతుగా జట్టుకు ఉపయోగపడ్డానని అనుకున్నా. కానీ, ఈ విషయాన్ని అందరూ మరచిపోయారు’ అని నాయర్ అన్నాడు.
Karun Nair expressed his disappointment after being left out of India’s Test squad for the West Indies tour.#KarunNair pic.twitter.com/fs7AVDGdrQ
— CricTracker (@Cricketracker) September 26, 2025
దేశవాళీ ట్రోఫీలో విదర్భ తరఫున శివాలెత్తిపోయి 863 రన్స్ చేసిన నాయర్.. ఇంగ్లండ్ లయన్స్‌పై డబుల్ సెంచరీతో చెలరేగాడు. దాంతో, ఇంగ్లండ్ పర్యటనలో అతడి బ్యాట్ నుంచి పరుగుల వరద ఖాయమనుకున్నారంతా. కానీ, అతడు మాత్రం 205 రన్స్‌తో నిరాశపరిచాడు.
‘ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ నుంచి మేము చాలా ఆశించాం. టాపార్డర్ విఫలైమనా అతడు నిలబడుతాడని అనుకున్నాం. కానీ, అతడు మా నమ్మకాన్ని వమ్ము చేశాడు. నాలగు ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఒక చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. అందుకే.. వెస్టిండీస్ సిరీస్‌కు పడిక్కల్‌ను తీసుకున్నాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ(BGT)లోనూ పడిక్కల్ ఆడాడు. నిరుడు ధర్మశాలలో ఇంగ్లండ్‌పై ఈ యంగ్‌స్టర్ గొప్ప ప్రదర్శన చేశాడు. తాజాగా భారత ‘ఏ’ జట్టు తరఫున సెంచరీతో చెలరేగాడు. సో.. నాయర్ కంటే ప్రస్తుతం అతడే మాకు మంచి ఛాయిస్ అనిపించాడు. ఇక స్క్వాడ్‌లోని వాళ్లకు 15-20 మ్యాచ్‌లు ఆడే అవకాశమిస్తాం. అప్పటికీ వాళ్లు రాణించకుంటే వేటు వేయడానికి ఆలోచించం’ అని అగార్కర్ వెల్లడించాడు.
🚨 Presenting #TeamIndia‘s squad for the West Indies Test series 🔽#INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/S4D5mDGJNN
— BCCI (@BCCI) September 25, 2025