కాంటర్బూరీ(ఇంగ్లండ్): టెస్టు సిరీస్‌కు సన్నాహకంగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న అనధికారిక టెస్టులో భారత ‘ఏ’ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నది. ఓవర్‌నైట్ స్కోరు 409/3 రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన యువ భారత్ 557 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ కరణ్ నాయర్(281 బంతుల్లో 204, 26ఫోర్లు, సిక్స్) డబుల్ సెంచరీతో కదంతొక్కాడు. ఇంగ్లండ్ ద్వితీయ శ్రేణి బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ కరణ్ సాధికారిక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. జురెల్(94) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. జోష్ హల్, జమాన్ అక్తర్ మూడేసి వికెట్లు తీశారు.