హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న రాష్ట్ర యువ స్కేటర్ అనుపోజు కాంతిశ్రీ ప్రతిభకు గుర్తింపు లభించింది. చైనా వేదికగా ఈ ఏడాది ఆఖర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ ప్రాబబుల్స్‌కు కాంతిశ్రీ ఎంపికైంది. అర్టిస్టిక్ స్కేటింగ్ విభాగంలో ఈ యువ స్కేటర్ పోటీకి దిగనుంది.
అర్జున అవార్డీ అనూప్‌కుమార్ యమా దగ్గర ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్న కాంతిశ్రీ అంతర్జాతీయ స్థాయిలో సత్తాచాటాలన్న పట్టుదలతో ఉంది. మరోవైపు రాష్ట్రం నుంచి స్కేట్‌బోర్డింగ్‌లో దుర్వి లాకోటియా ఎంపికయ్యాడు. హంగ్జు నగరం వేదికగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు 19వ ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. వాస్తవానికి గత ఏడాదే జరుగాల్సి ఉన్నా..కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి.