Kane Williamson | విలియమ్సన్కు మోకాలి సర్జరీ.. వరల్డ్ కప్‌లో ఆడేది అనుమానమే!
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గాలనుకున్న న్యూజిలాండ్ జట్టుకు పెద్ద షాక్. స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamso) ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ పోరులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను త్వరలోనే కుడి మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడు.
Kane Williamson : ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ నెగ్గాలనుకున్న న్యూజిలాండ్ జట్టుకు పెద్ద షాక్. స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్(Kane Williamso) ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ పోరులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను త్వరలోనే కుడి మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడు. అతను కోలుకునేందుకు, ఫిట్నెస్ సాధించేందుకు కనీసం ఆరు నెలల సమయం పట్టనుంది. దాంతో, వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు విలియమ్సన్ దూరం కానున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ (New Zealand Cricket) తెలిపింది.
‘న్యూజిలాండ్ క్రికెట్, గుజరాత్ టైటన్స్ ఫ్రాంఛైజీ నుంచి గత కొన్ని రోజులుగా నాకు చాలా మద్దతు లభించింది. ఫీల్డింగ్ చేస్తూ అలా గాయపడడం ఎవరికైనా నిరాశకు గురి చేస్తుంది. అయితే.. ఇప్పుడు నా ఫోకస్ అంతా సర్జరీ మీద, రీహాబిలిటేషన్‌లో ఉండడం మీద మాత్రమే ఉంది. నేను కోలుకునేందుకు కొంత సమయం పట్టనుంది. వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను’ అని ఈ స్టార్ ఆటగాడు న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటనలో తెలిపాడు. ఇప్పటికే విలియమ్సన్ ఐపీఎల్‌కు దూరమైన విషయం తెలిసిందే.
నొప్పితో మైదానం వీడి..
ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ కివీస్ బ్యాటర్ గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన బంతిని బౌండరీ వద్ద ఎగిరి ఆపేందుకు ప్రయత్నించి కింద పడ్డాడు. అనంతరం నొప్పితో విలవిలలాడుతూ మైదానం వీడాడు. స్కానింగ్‌లో అతని కుడిమోకాలు బెణికినట్టు గుర్తించారు. దాంతో, న్యూజిలాండ్ క్రికెట్(NZ) పిలుపు మేరకు అతను స్వదేశానికి వెళ్లాడు. ఆఖర్లో ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ ధాటిగా ఆడడడంతో పాండ్యా సేన విజయం సాధించింది.
కివీస్ విజయాల వెనక
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ – నవంబర్ మధ్యలో ఈ మెగా టోర్నీ జరగనుంది. మోకాలి సర్జరీ కారణంగా విలియమ్సన్ ఈసారి టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. మిడిలార్డర్లో అతడిలా ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ఆటగాడు లేకపోవడం బ్లాక్ కాప్స్‌కు పెద్ద లోటు. 2019 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన కివీస్ రన్నరప్‌గా నిలిచింది. బెన్ స్టోక్స్ చెలరేగడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఉత్కంఠ రేపిన సూపర్ ఓవర్లో ఇయాన్ మోర్గాన్ సేన ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఈ టోర్నమెంట్లో విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. టెస్టు ఫార్మాట్లో కివీస్ చారిత్రాత్మక విజయాలు వెనక ఈ మాజీ కెప్టెన్ ఉన్నాడు. ఈ మధ్యే సొంత గడ్డపై ఇంగ్లండ్, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విలియమ్సన్ సెంచరీలతో రాణించాడు. దాంతో, కివీస్ సంచలన విజయాలు నమోదు చేసింది.
ఇవి కూడా చదవండి
Nikhat Zareen | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌ను సన్మానించిన సీఎస్, డీజీపీ
ఎమ్‌సీసీలో ధోనీకి సభ్యత్వం
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

