క్రైస్ట్‌చర్చ్: భారత్‌పై చరిత్రాత్మక టెస్టు సిరీస్ విజయం అనంతరం సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు న్యూజిలాండ్ నిలకడగా ఆడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 83 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 319 పరుగుల స్కోరుచేసింది. మాజీ సారథి కేన్ విలియమ్సన్ (93) తృటిలో శతకం చేజార్చుకోగా కెప్టెన్ టామ్ లాథమ్ (47), గ్లెన్ ఫిలిప్స్ (41 నాటౌట్) రాణించారు. ఒకదశలో 198/3గా పటిష్టంగా కనిపించిన కివీస్.. ఇంగ్లీష్ స్పిన్నర్ షోయబ్ బషీర్ (4/69) ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.