Kane Williamson | నా ముందున్న అతిపెద్ద లక్ష్యమదే..! ప్రపంచ కప్‌పై విలియమ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Kane Williamson : వరల్డ్ కప్(ODI World Cup) టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఫైనల్లో భంగపడిన న్యూజిలాండ్(New Zealand) ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. అయితే.. ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న అతను టోర్నీ సమయానికి ఫిట్‌గా ఉంటాడా? లేదా? అనేది సందేహమే. అయితే..
Kane Williamson : వరల్డ్ కప్(ODI World Cup) టోర్నీకి సమయం దగ్గర పడుతోంది. నాలుగేళ్ల క్రితం ఫైనల్లో భంగపడిన న్యూజిలాండ్(New Zealand) ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది. అయితే.. ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్(Kane Williamson) ఇంకా ఫిట్నెస్ సాధించలేదు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న అతను టోర్నీ సమయానికి ఫిట్‌గా ఉంటాడా? లేదా? అనేది సందేహమే. అయితే.. తాజాగా వన్డే వరల్డ్ కప్ ఆడడంపై ఈ కివీస్ లెజెండ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకోవడమే తన ముందున్న అతిపెద్ద లక్ష్యమని అన్నాడు.
‘ప్రపంచ కప్‌లాంటి మెగా టోర్నీలో ఆడడం ఎవరికైనా ప్రత్యేకమే. ఇప్పటికైతే నేను కొంచెం మెరుగయ్యాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఫిజియోలు, సపోర్టింగ్ స్టాఫ్, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సూచించిన పద్ధతులు పాటిస్తున్నా. అయితే.. ఈ మెగా టోర్నీ ప్రారంభం కల్లా పూర్తి ఫిట్నెస్ సాధించడం అనేది కష్టమే. అయినా.. అన్నిరోజులు మంచిగా ఉండవు కదా. కొన్నిసార్లు చెడ్డ రోజులు కూడా ఎదురవుతాయి. కానీ, ఒక్కటి మాత్రం నిజం.. ప్రపంచ కప్ అనేసరికి ఎక్కడ లేని ఉత్తేజం వస్తుంది. మరింత మెరుగయ్యేందుకు కావాల్సిన ప్రోత్సాహం దొరుకుతుంది’ అని విలియమ్సన్ తెలిపాడు.
బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విలియమ్సన్

ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ పోరులో గాయపడిన విలియమ్సన్ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. గత 4 నెలలకు పైగా క్రికెట్‌కు దూరమైన అతను ఈమధ్యే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దాంతో, అతను ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్‌లో ఆడతాడనే వార్తలు ఊపందుకున్నాయి. కానీ, విలియమ్సన్ మునపటిలా క్రికెట్ ఆడేందుకు మరింత సమయం పట్టనుందని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్(Gary Stead) అంటున్నాడు. ఇప్పటికే స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్(Trent Boult) మళ్లీ జట్టులోకి వచ్చాడు. భారత్ వేదికగా జరుగనున్న మెగా టోర్నీలో సత్తా చాటాలని అతను తహతహలాడుతున్నాడు. అక్టోబర్ 5న ప్రపంచ కప్ మొదల్వనుంది. ఆరంభ పోరులో కివీస్, ఇంగ్లండ్‌తో తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

