హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్(హెచ్పీజీఎల్) టోర్నీలో కళింగ వారియర్స్, కాంటినెంటల్స్ వారియర్స్ తుది పోరులో నిలిచాయి. వూటీ గోల్ఫ్ కోర్స్‌లో శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో కళింగ టీమ్ 55-25 స్కోరుతో టీమ్అల్ఫాపై ఘన విజయం సాధించింది. ఆదిత్య బొమ్మరాజు, ఇషాన్ అలీ, రణధీర్‌రెడ్డి, మణికాంత్‌రెడ్డి..కళింగ విజయంలో కీలకమయ్యారు. మరోవైపు రెండో సెమీస్‌లో కాంటినెంటల్ 20-30 స్కోరుత టైమ్ మైసాను ఓడించింది. కాంటినెంటల్ టీమ్‌లో రామ్ ముసునూరి, జగన్మోహన్రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి అద్భుత ప్రదర్శన కనబరిచారు. వియాత్నంలో ఈనెల 23న జరిగే ఫైనల్లో కళింగ, కాంటినెంటల్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.