హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ పురుషుల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ జోసెఫ్ కాలేజీకి చెందిన కె. మనీష్ గౌడ్ మూడు స్వర్ణాలతో సత్తాచాటాడు. 50 మీటర్ల, 100 మీ., 200 మీ. బ్రేక్ స్ట్రోక్‌లో మనీష్ బంగారు పతకాలు గెలచుకున్నాడు.
సికింద్రాబాద్‌లోని జీహెచ్ఎంసీ స్విమ్మింగ్‌పూల్‌లో జరిగిన ఈ పోటీల్లో ఓవరాల్‌గా టీమ్ చాంపియన్‌షిప్‌ను భద్రుకా కాలేజీ దక్కించుకోగా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ రెండో స్థానం సాధించింది. మాతృ శ్రీ కళాశాల మూడో స్థానంలో నిలిచింది.