న్యూఢిల్లీ: ఆసియా పారా ట్రాక్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్రానికి చెందిన జ్యోతి గదేరియా ఖాతాలో రెండో పసిడి పతకం చేరింది. సోమవారం జరిగిన మహిళల 3కి.మీల వ్యక్తిగత విభాగంలో పోటీకి దిగిన జ్యోతి రేసును 5:24:55 సెకన్ల టైమింగ్‌తో ముగించి స్వర్ణం కైవసం చేసుకుంది. అంతకుముందు జరిగిన 500మీటర్ల విభాగంలోనూ అగ్రస్థానంతో పసిడి దక్కించుకుంది.
మరోవైపు పురుషుల 4కి.మీల విభాగంలో అర్షద్ షేక్ 6:29:21 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానంలోనిలిచి కాంస్యం సొంతం చేసుకోగా, మరో పోటీలో రజతంతో మెరిశాడు. జ్యోతి, అర్షద్‌తో పాటు బసవరాజ్ కాంస్యం దక్కించుకున్నాడు. ఆదిత్య మెహతా ఫౌండేషన్‌లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వీరు.. భారత పారా సైక్లింగ్ జట్టు సాధించిన ఆరు పతకాల్లో ఐదు వీరు సాధించినవే కావడం విశేషం.