మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి జస్టిన్ లాంగర్ తప్పుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జూన్ వరకు కాలవ్యవధి ఉన్నా.. సీనియర్ ఆటగాళ్లతో విభేదాల కారణంగా లాంగర్ కోచింగ్ బాధ్యతలను వదులుకున్నట్లు సమాచారం. ఈ మేరకు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ శనివారం ఒక ప్రకటన విడుదల చే సింది. ‘ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్గా లాంగర్ రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపింది. పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా జట్టుతో కొనసాగాలని లాంగర్ భావించినా.. కీలక ఆటగాళ్లతో అభిప్రాయభేదాలు ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.