న్యూఢిల్లీ : ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫిట్నెస్తో ఇబ్బందులతో ఐపీఎల్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో మరో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ జోర్డాన్‌కు అవకాశం కల్పించినట్టు ముంబై ఇండియన్స్ యాజమాన్యం తెలిపింది.
ముంబై రూ.8 కోట్లకు ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. ఈ సీజన్లో అతడు అయిదు మ్యాచ్‌లలో రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. 2016లో ఐపీఎల్లో ప్రవేశించిన జోర్డాన్ ఇప్పటివరకు బెంగళూరు, హైదరాబాద్, పంజాబ్, చెన్నై జట్లకు 28 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు.