ముల్తాన్: పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్నది. పాకిస్థాన్ బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్ బ్యాటర్లు ఇరుగదీస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 96/1తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్.. జోరూట్(277 బంతుల్లో 176 నాటౌట్, 12ఫోర్లు), హ్యారీ బ్రూక్(173 బంతుల్లో 141 నాటౌట్, 12ఫోర్లు, సిక్స్) సెంచరీల విజృంభణతో ఇంగ్లండ్ ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 492 పరుగులు చేసింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 35వ సెంచరీతో మరింత ముందంజ వేశాడు.టెస్టుల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కుక్‌ను దాటేశాడు. బౌలర్లకు ఏమాత్రం సహకరించని పిచ్‌పై రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 243 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.