Joe Root | ఇంగ్లండ్‌కు చెందిన బ్యాట్స్‌మెన్ జో రూట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టెస్ట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తూ రికార్డులను తిరగరాస్తున్నాడు. దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువుయ్యాడు. ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే రాబోయే సచిన్ రికార్డును అధిగమించే అవకాశాలున్నాయి. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో సచిన్ తొలి స్థానంలో ఉన్నాడు. సచిన్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేయగా.. ఆ తర్వాతి స్థానంలో జో రూట్ నిలిచాడు. ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న రూట్. 157 టెస్టుల్లో 13,409 పరుగులు చేశాడు. 2512 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్‌తో జరిగిన మాంచెస్టర్‌తో సెంచరీ చేసి రికార్డులకెక్కాడు. ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే రెండు మూడేళ్లలో సచిన్ రికార్డును అధిగమించే అవకాశాలున్నాయి.
జో రూట్ డిసెంబర్ 1990లో ఇంగ్లండ్‌లో జన్మించాడు. కరాచీలో సచిన్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఏడాది తర్వాత రూట్ పుట్టాడు. అయితే, టెస్టుల్లో సచిన్ రికార్డును అధిగమించడంపై జో రూట్ సోనీ లివ్‌లో హర్ష భోగ్లేతో మాట్లాడారు. తన ప్రయాణం గురించి మాట్లాడుతూ టెండూల్కర్ నుంచి ప్రేరణ పొందినట్లు తెలిపాడు. శుక్రవారం భారత్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో మూడో రోజున రికీ పాంటింగ్ చేసిన 13,378 పరుగుల మార్క్‌ని అధిగమించి రెండోస్థానానికి చేరుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండోస్థానానికి చేరుకున్నాడు. రూట్ 2012లో నాగ్‌పూర్ టెస్టులో అరంగేట్రం చేశాడు.
ఇది సచిన్ టెస్టుల్లో రిటైర్మెంట్ దశలో ఉన్నప్పటి సిరీస్. ఆ క్షణాలను జో రూట్ గుర్తు చేసుకున్నాడు. సచిన్ ఓ గొప్ప లెజెండ్ అని.. అతను ఎదుర్కొన్న ఒత్తిడి.. సాధించిన విజయాలు అసాధారణమని తెలిపాడు. బాల్యం నుంచి చూస్తూ పెరిగిన ఆటగాడిని ప్రత్యక్షంగా.. ఎదుర్కోవడం ఓ అద్భుతమైన అనుభవమని పేర్కొన్నాడు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చాక స్టేడియంలో ఉన్న ప్రతీ ఒక్కరూ చప్పట్లు కొడుతూ అతన్ని స్వాగతించారని.. ఇది తనకు చాలా కొత్తగా అనిపించిందని.. ఇది సచిన్ గొప్ప తనాన్ని తెలియజేస్తుందని రూట్ వ్యాఖ్యానించాడు. అంతిమంగా సచిన్ రికార్డును అధిగమిస్తారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇలాంటి విషయాలపై తాను దృష్టి పెట్టనని.. ఇవన్నీ ఆటలో భాగంగా సహజంగానే జరగాలని చెప్పుకొచ్చాడు.