Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వరద పారిస్తున్న ఇంగ్లండ్ స్టార్ జో రూట్(Joe Root) తన కల సాకారం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఏళ్లుగా ఊరిస్తూ వస్తున్న శతకాన్ని అందుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో రెండోదైన గబ్బా టెస్టు (Gabba Test)లో సమయోచిత సెంచరీతో చెలరేగాడు రూట్. ప్రధాన ఆటగాళ్ల వైఫల్యంతో మరోసారి కుప్పకూలేలా కనిపించిన జట్టును ఆదుకుంటూ ఆసీస్ గడ్డపై తొలిసారి వంద కొట్టాడీ రన్ మెషీన్. పింక్ బాల్ టెస్టులో ఒత్తిడిలోనూ పట్టుదల కనబరిచి.. 181 బంతుల్లో మూడంకెల స్కోర్ చేరుకున్నాడు ఇంగ్లండ్ స్టార్.
యాసెస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ సెంచరీ (Joe Root) చేయకుంటే తాను మెల్బోర్న్ క్రికెట్ మైదానం(MCG)లో నగ్నంగా నడుస్తానని వెల్లడించాడు. ‘ఆల్ ఓవర్ బార్ ది క్రికెట్’ అనే పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ‘యాషెస్ ఆల్‌టైమ్ జట్టు’లో రూట్ పేరు లేకపోవడాన్ని అతడు తప్పుపట్టాడు. ఫ్యాబ్ 4లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రూట్‌ను పక్కన పెట్టడం అవివేకమని హేడెన్ అన్నాడు. అంతటితో ఆగకుండా ఎవరూ ఊహించని కామెంట్ చేశాడీ వెటరన్.
🚨🚨Mathew Hayden’s congratulating Joe Root on 100 & saving him from walking naked in MCG😂
“Congratulations mate on a 100 here in Australia, took you a while & there was no one that had more skin in the game than me, literally🤣🤣”.pic.twitter.com/0RI9hSGGsC
— Rajiv (@Rajiv1841) December 4, 2025
‘ఇంగ్లండ్ స్క్వాడ్‌లో అన్నివిధాల ఉపయుక్తమైన క్రికెటర్ రూట్. మీరు అతడిని ఆల్‌టైమ్ టీమ్‌లో తీసుకోకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం రూట్ సగటు 40. అత్యధిక స్కోర్ 180. ఈ వేసవిలో ఆసీస్‌పై అతడు సెంచరీ కొట్టకుంటే నేను ఎంసీజీలో నగ్నంగా నడుస్తాను’ అని ఆల్ఓవర్ బార్ ది క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో హేడెన్ పేర్కొన్నాడు. హేడెన్ చేసిన కామెంట్స్‌పై అతడి కూతురు గ్రేస్ హ్యారిస్ ఫన్నీగా స్పందించింది. ‘ప్లీజ్ రూట్.. సెంచరీ కొట్టు’ అని కామెంట్ చేసింది.
ఇతర జట్లపై చెలరేగిపోయే ఈ సొగసరి బ్యాటర్ ఆస్ట్రేలియాలో ఒక్క సెంచరీ కొట్టలేదు. గత 27 ఇన్నింగ్స్‌ల్లో 35.68 సగటుతో 892 రన్స్ చేశాడంతే. మూడుసార్లు రూట్ 80 ల్లోనే ఔటయ్యాడు. దాంతో, ఈసారైనా కంగారూ నేలపై శతకం బాదాలనే కసితో ఉన్నాడీ నంబర్ 1 బ్యాటర్. యాషెస్ సిరీస్ 2025-26 ఈ ఏడాది నవంబర్ 21 నుంచి జనవరి 8 వరకూ జరుగనుంది. అయితే.. గత మూడు పర్యాయాలు కంగారూ గడ్డపై ఇంగ్లండ్ జట్టు ఓడిపోతూ వస్తోంది. 2011 తర్వాత ఇంగ్లీష్ టీమ్ అక్కడ ఒక్కటంటే ఒక్క టెస్టు గెలువలేదు. సో.. ఈ చెత్త రికార్డును చెరిపేయాలని బెన్ స్టోక్స్ బృందం అనుకుంటోంది.
HE’S FINALLY DONE IT!
Joe Root has his first #Ashes century in Australia.
Live blog: https://t.co/2htO3lMX8d pic.twitter.com/9uZ26zQnPp
— cricket.com.au (@cricketcomau) December 4, 2025
గబ్బా టెస్టు ఆరంభంలోనే ఇంగ్లండ్‌కు మిచెల్ స్టార్క్ పెద్ద షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ డకెట్(0), ఓలీ పోప్(0)లను ఔట్ చేసి.. పర్యాటక జట్టును ఒత్తిడిలో పడేశాడు. 5 పరుగులకే 2 వికెట్లు పడిన అనంతరం క్రీజులోకి వచ్చిన రూట్.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలే(76)తో కలిసి జట్టును ఆదుకుంటూ స్కోర్‌బోర్డును నడిపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపికగా ఆడిన రూట్181 బంతుల్లో కంగారూ గడ్డపై మొదటి శతకం సాధించాడు.