Sanath Jayasuriya : శ్రీలంకలో ‘దిత్వా తుఫాన్’ (Ditwah Cyclone)సృష్టించిన విలయం, విధ్వంసం మాటలకందనిది. ఈ విపత్కర పరిస్థితితో ఆర్ధిక సంక్షోభంలో పడిన పొరుగు దేశానికి భారత్ ఆపన్నహస్తం అందించింది. ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ద్వారా మరింత చేస్తామని లంక అధ్యక్షుడికి ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. మిత్రదేశమైన భారత్ వేగంగా స్పందించిన తీరును లంకేయులు ప్రశంసిస్తున్నారు. భారత ప్రభుత్వం చేసిన సాయాన్ని మరువలేమని దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య (Sanath Jayasuriya) అన్నాడు. ఈ వెటరన్ ఆటగాడు మంగళవారం ఎక్స్ వేదికగా భారత్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
దిత్వా తుఫాన్ కారణంగా చిగురుటాకుల వణికిపోయిన శ్రీలంకలో భారత వాయుసేన, విపత్తు నివారణ బృందాలు వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. బాధితులకు ఆహారం, అవసరమైన సామగ్రి అందించి భారత్ మీకు అండగా ఉంటుందనే ధైర్యమిచ్చాయి. ఈ కష్టకాలంలో మనదేశం అందించిన సాయంపై ఆ దేశ దిగ్గజం సనత్ జయసూర్య స్పందించాడు. లంకేయుల ప్రాణాలు కాపాడిన భారత వైమానికి దళం సేవల్ని అతడు ఎంతో ప్రశంసించాడు.
‘విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న శ్రీలంక పక్షాన నిలిచినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ వ్యవహారాల శాఖమంత్రి జై శంకర్, భారత ప్రజలకు కృతజ్జతలు. మా దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పుడు మీరు మద్దతుగా నిలిచారు. ఇది మన రెండు దేశాల మధ్య ఉన్న ద్రుఢమైన స్నేహబంధానికి ప్రతీక. అవసరమైనప్పుడు మాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు’ అని జయసూర్య తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ఒకప్పుడు శ్రీలంక విధ్వంసక ఓపెనర్ అయిన జయసూర్య ప్రస్తుతం ఆ దేశ పురుషుల జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందిస్తున్నాడు.
Grateful to Hon PM @narendramodi, EAM @DrSJaishankar & the people of India for standing with Sri Lanka in these difficult days. 🇱🇰🇮🇳 Your support, as during our economic crisis, shows the true strength of our friendship. Thank you for being with us when it matters most. 🙏 https://t.co/n4gFI7gL5c
— Sanath Jayasuriya (@Sanath07) December 2, 2025
నవంబర్ 16 నుంచి మారిన వాతావరణ పరిస్థితులు, దిత్వా తుఫాన్ ప్రభావంతో శ్రీలంకలో 330 మంది మరణించారు. ఇప్పటివరకూ 370 మంది ఆచూకీ లభించలేద. గూడు చెదిరి.. సర్వం కోల్పోయి దాదాపు 11లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. వరద గుప్పిట చిక్కుకున్న శ్రీలంక ప్రజలను కాపాడేందుకు భారత వాయుసేన వెంటనే రంగంలోకి దిగింది. కొండచరియలు విరిగిపడిన కొటమలే ప్రాంతం నుంచి పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతేకాదు ఇప్పటికే 21 టన్నుల సామగ్రిని లంకకు పంపింది భారత్.
“The country will never forget the service the armed forces are doing.”
Legendary cricketer Sanath Jayasuriya thanked the armed forces for their valuable service in saving lives, while handing over relief items.
Cricketers Kusal Mendis, Janith Liyanage, and Jehan Mubarak also… pic.twitter.com/wduP3g8nKP
— NewsWire 🇱🇰 (@NewsWireLK) December 1, 2025
సోమవారం లంక అధ్యక్షుడు అరుణు కుమర్ దిస్సనాయకేతో ఫోన్లో మాట్లాడిన.. ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశంలోని తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆ దేశంలోని తుఫాన్ బాధితులకు పునరావాసం, ప్రజలకు నిత్యవసరాలు వంటివి సమకూర్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ ఈ సందర్భంగా దిస్సనాయకేకు స్పష్టం చేశారు. ‘ఆపరేసన్ సాగర బంధు'(Operation Sagara Bandhu) ద్వారా మరింత సాయం చేస్తామని ప్రధాని లంక నాయకుడికి హామీ ఇచ్చారు.