హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 9వ రాష్ట్ర అంతర్‌జిల్లాల టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో జతిన్‌దేవ్ రెండు టైటిళ్లతో మెరిశాడు. శనివారం జరిగిన బాలుర అండర్-15 విభాగంలో జతిన్ 11-8, 11-8, 12-10, 11-9తో శౌర్యరాజ్ సక్సేనాపై అద్భుత విజయం సాధించాడు. అదే జోరు కొనసాగిస్తూ అండర్-17 కేటగిరీ తుదిపోరులో జతిన్ 13-11, 12-10, 11-8, 9-11, 11-7తో తరుణ్‌పై గెలిచి రెండో టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా వరుసగా ఆరోసారి రాష్ట్ర టైటిల్ దక్కించుకున్న ప్లేయర్‌గా జతిన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అండర్-19 విభాగంలోనూ ఈ యువ ప్లేయర్ ఫైనల్ పోరులో నిలిచాడు. బాలికల అండర్-17 విభాగంలో సత్య విజేతగా నిలిచింది.