చిక్కడపల్లి: తెలంగాణ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ మాస్టర్స్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో జస్విందర్, వరలక్ష్మి సత్తాచాటారు.
ఆదివారం జరిగిన అండర్-45 మహిళల విభాగంలో జస్విందర్ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, వరలక్ష్మికి రజత పతకం దక్కింది. వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ చైర్మన్ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి పీవీఆర్ నాయుడు, శృతి..విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.