Bumrah | వన్డే సిరీస్ నుంచి బుమ్రా అవుట్.. కారణం ఇదే
ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా సిరీస్‌లో బరిలోకి దిగనున్న బుమ్రా
Bumrah : శ్రీలంకతో తొలి వన్డేకు ముందు టీమిండియాకు షాక్.. భారత స్పీడ్‌స్టర్ జస్ప్ప్రీత్ బుమ్రా మూడు వన్డేల సిరీస్‌కు దూరం కానున్నాడు. అతనికి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావించడమే అందుకు కారణం. వెన్నెముక గాయం నుంచి కోలుకున్న బుమ్రాకు జాతీయ క్రికెట్ అకాడమీ ఈమధ్యే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతో, చేతన్‌శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ జనవరి 3న వన్డే సిరీస్‌కు బుమ్రాను 17 ఆటగాడిగా ఎంపిక చేశారు. అయితే.. బీసీసీఐ యూ టర్న్ తీసుకుంది. అతడిని ఆడించే విషయంలో తొందరపాటు వద్దని నిర్ణయించుకుంది ఎందుకంటే.. పోయిన ఏడాది ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చిన బుమ్రా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మళ్లీ వెన్నునొప్పితో బాధపడ్డాడు. దాంతో టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడు. అందుకని ఈ స్టార్ పేసర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు అనుకుంటోంది. మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే సిరీస్ నుంచి తప్పించనుంది. శ్రీలంక, భారత్ జట్ల మధ్య తొలి వన్డే రేపు గువాహటిలో జరగనుంది.
టీమిండియా కీలక బౌలర్ అయిన బుమ్రా 2022 అక్టోబర్ నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతను ఫిబ్రవరిలో స్వదేశంలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇరుజట్లు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నమెంట్ మొదలుకానుంది. ఈ ఏడాది రెండు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. టెస్టు ఛాంపియన్ షిప్, వన్డే వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల్లో బుమ్రా కీలకం కానున్నాడు. అందుకని ఈ స్టార్ పేసర్ ఫిట్‌గా ఉండడం భారత్‌కు చాలా ముఖ్యం. కాబట్టే అతడి ఆరోగ్యం విషయంలో బీసీసీఐ అంతగా శ్రద్ధ తీసుకుంటోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

