టోక్యో : జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్‌కే ముగిసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ద్వయంతో పాటు సింగిల్స్ విభాగాల్లో లక్ష్యసేన్, అనుపమ ఉపాధ్యాయ రెండో రౌండ్లోనే నిష్క్రమించారు.
గురువారం జరిగిన రెండో రౌండ్లో సాత్విక్-చిరాగ్ జోడీ.. 22-24, 14-21తో ఐదో సీడ్ చైనా ద్వయం లియాంగ్ వీ కెంగ్-వాంగ్ చెంగ్ చేతిలో ఓటమిపాలయ్యారు. లక్ష్యసేన్.. 19-21, 11-21తో జపాన్ షట్లర్ కొడాయ్ నరకొర జోరు ముందు నిలువలేకపోయాడు. అనుపమ కూడా ఓడటంతో ఈ టోర్నీలో భారత పోరాటం ముగిసినైట్టెంది.