న్యూయార్క్ : యూఎస్ ఓపెన్‌లో టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన ఇటలీ కుర్రాడు జన్నిక్ సిన్నర్ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేశాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఒకటో సీడ్ సిన్నర్ 6-2, 1-6, 6-1, 6-4తొ డేనిల్ మెద్వెదెవ్ (రష్యా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌కు అర్హత సాధించాడు.
ఈ పోరులో గెలవడం ద్వారా కొరడొ బరఝూట్టి (1977), బెర్రెట్టిని (2019) తర్వాత యూఎస్ ఓపెన్‌లో సెమీస్ చేరిన మూడో ఇటలీ ప్లేయర్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో జెస్సిక పెగులా 6-2, 6-4తో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ స్వియాటెక్‌ను ఓడించి సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది.